వెస్టిండీస్-శ్రీలంక మూడో వన్డేకు కొంతసేపు తెనేటీగలు అంతరాయం కలిగించాయి. లంక ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. విండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ బౌలింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా తెనేటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది. గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు.. వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్‌పై పడుకున్నారు. కాసేపటికి ఆ గుంపు.. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లిపోయింది. తర్వాత ఆట కొనసాగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తెనేటీగలు ఆట మధ్యలో ఇలా అంతరాయం కలిగించడం ఇదేమీ కొత్త కాదు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. కాసేపటి తర్వాత ఆట మొదలైంది.ఈ వన్డేలో విండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 274 పరుగులు చేసింది.
డి సిల్వా, బండారా అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పొలార్డ్ సేన 48.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. డారెన్ బ్రేవో సెంచరీతో ఆకట్టుకోగా.. షై హోప్, కీరన్ పొలార్డ్ అర్థ సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
చెరుకు రసంతో మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ఏకంగా భారత్ లో ఏడు చోట్ల సోదాలు.. ఏం దొరుకుతుంది అని ఎదురు చూపులు..!