Tuesday, April 23, 2024
- Advertisement -

ఆసియా కప్ : ఫైనల్ లో పాక్ చిత్తు.. కప్పు లంకదే !

- Advertisement -

ఆసియా కప్ ఎట్టకేలకు ముగిసింది. పాకిస్తాన్, శ్రీలంక మద్య ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆసియా కప్ బరిలో దిగిన శ్రీలంక మొదటి నుంచి సమిష్టిగా ఆసియా కప్ లో తిరుగులేని జట్టుగా నిలిచింది. ఇక ఈ విజయంతో ఆసియా కప్పును ఆరు సార్లు గెలిచిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో లంక 58 పరుగులకే.. 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ నేపథ్యంలో బానుక రాజపక్స అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు అండగా నిలిచాడు. 45 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హారసంగా 21 బంతుల్లో 36 పరుగులు, దనంజయ 21 బంతుల్లో 28 పరుగులు చేయగా..మిగిలిన బ్యాట్స్ మెన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. రాజపక్స మెరుపు ఇన్నింగ్స్ తో లంకేయులు భారీ స్కోర్ ను పాక్ ముందు ఉంచారు. ఇక 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. లంకేయుల బౌలింగ్ ధాటికి ఏమాత్రం నిలువలేకపోయింది. ముఖ్యంగా ప్రమోద్ మదూషన్ నాలుగు కీలక వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచాడు. పాక్ జట్టులో రిజ్వన్ 55 పరుగులు, ఇఫ్తికర్ అహ్మద్ 32 పరుగులు చేశారు.

ఇక మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంత కూడా లంక బౌలింగ్ ధాటికి నీలివలేకపోయారు. దీంతో పాక్ 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ గా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన లంక 23 పరుగుల తేడాతో పాక్ పై విజయం సాధించింది. జట్టు విజయనికి కీలక పాత్ర వహించి అద్బుత ఇన్నింగ్స్ ఆడిన బానుక రాజపక్స మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక పెను సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఆసియా కప్ సాధించడం.. ఆదేశ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -