Friday, April 26, 2024
- Advertisement -

ఆసియా కప్ : గెలిస్తే ముందుకి.. ఒడితే ఇంటికి !

- Advertisement -

దుబాయ్ వేదికగా జరుగుతున్నా ఐసియా కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సూపర్ 4లో పాకిస్తాన్ బ్రేక్ వేసింది. లీగ్ దశలో పాక్ పై విజయం సాధించిన రోహిత్ సేన.. సూపర్ 4 మాత్రం పాకిస్తాన్ కు తలోగ్గింది. దీంతో తరువాత ఆడబోయే రెండు మ్యాచ్ లలో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నేడు శ్రీలంక తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్ కు డూ ఆర్ డై అని చెప్పవచ్చు.

ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆసియా కప్ ఫైనల్ కు వెళ్ళే ఆశలు సజీవంగా ఉంటాయి. లేక పోతే టోర్నీలో హాట్ ఫేవరెట్ గా ఉన్న టీమిండియా తట్ట బుట్ట సర్ధుకొని ఇంటిముఖం పట్టాల్సిందే. దాంతో గత మ్యాచ్ లో జరిగిన లోటు పాట్లను సరిచేసుకొని బలిలో దిగాల్సి ఉంటుంది. అయితే గత మ్యాచ్ లో గెలిచే అవకాశం ఉన్న టీమిండియా.. కేవలం నిర్లక్ష్యం వల్లే మ్యాచ్ ని చేజెతులా ప్రత్యర్థి జట్టుకు అప్పగించిందని మాజీల తో పాటు సగటు క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. అందువల్ల శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో రోహిత్ సేన సమిష్టిగా రాణిస్తేనే విజయావకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

ఇక శ్రీలంక ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ పై విజయం సాధించి సూపర్ 4 లో బోణి కొట్టింది. అంతే కాకుండా లంకేయులు సమిష్టిగా రానిస్తూ దూసుకుపోతున్నారు. అందువల్ల లంకనూ తేలిగ్గా అంచనా వేస్తే రోహిత్ సేన కంగు తినే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి గత మ్యాచ్ లో జరిగిన పరాభవాన్ని దృష్టిలో ఉంచుకొని.. శ్రీలంకపై రోహిత్ సేన ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 లకు ప్రసారం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -