Saturday, April 20, 2024
- Advertisement -

ఆసియా కప్ : నేడే ఫైనల్ పోరు.. పాక్, శ్రీలంక అమీతుమీ !

- Advertisement -

దుబాయ్ వేదికగా జరుగుతున్నా ఆసియా కప్ ఎట్టకేలకు ఫైనల్ కు చేరుకుంది. నేడు పాక్, శ్రీలంక జట్లు దుబాయ్ ఎంటర్నేషనల్ స్టేడియంలో తుది పోరులో తలపడనున్నాయి. ఆసియా కప్ ప్రారంభంలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఊహించని విధంగా సూపర్ 4లో నిష్క్రమించింది. ఇక సూపర్ 4 లో భారత్ ను ఓడించిన పాక్, శ్రీలంక జట్లు ఫైనల్ పోరులో తలపడుతుండడంతో కప్పు ఏ జట్టు సొంతం చేసుకోబోతుందో అని ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇరుజట్ల బలా బలాల విషయానికొస్తే.. శ్రీలంక జట్టు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్ లో ఉంది.

సీనియర్ ప్లేయర్స్ ఎవరు లేకపోయినప్పటికి.. షనక కెప్టెన్సీలో లంకేయులు అద్బుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ వంటి అన్నీ విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తున్నారు. కెప్టెన్ షనక తో పాటు కుషల్ మెండిస్, పటుమ్ నిశాంక వంటి ప్రేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లోనూ కరుణరత్నే, తీక్షణ వంటి వారు చెప్పుకోదగ్గ స్థాయిలోనే బౌలింగ్ చేసుండడంతో ఆ జట్టు సమిష్టిగా రాణించే అవకాశం ఉంది. పైగా గత శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాక్ పై విజయం సాధించడం లంకేయులకు కలిసొచ్చే అంశం.

ఇక పాక్ విషయానికొస్తే.. 2012 లో ఆసియా కప్ నెగ్గిన పాక్.. దాదాపు పదేళ్ళ తరువాత మరోసారి ఆసియా కప్ పై కన్నెసింది. ప్రస్తుతం జట్టు ఉన్న ఫామ్ చూస్తుంటే.. కప్పు గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.. పాక్ విద్వాంసక ఓపెనర్ మహ్మద్ రిజ్వన్ అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడు, ఇక జమాన్, ఇఫ్తికర్, ఆసిఫ్ అలీ, వంటి వారు పాక్ మిడిలార్డర్ లో బలంగా ఉండడంతో ఆ జట్టుకు తిరుగులేదనే చెప్పవచ్చు. కానీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. కానీ ఫైనల్ మ్యాచ్ లోనైనా అతడు ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇక శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లపై కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి ఆసియా కప్ కోసం పోటీ పడుతున్న ఇరు జట్లలో కప్పు ఏ జట్టు ఎగరేసుకెళ్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -