Sunday, May 19, 2024
- Advertisement -

సంప్ర‌దాయం వ‌దిలేసి… కోటు, ప్యాంటు వైపు…

- Advertisement -

అంత‌ర్జాతీయ వేడ‌క‌ల్లో భార‌త సంప్ర‌దాయం క‌నిపించేలా ఇన్నాళ్లు చీర క‌నిపించేది. అథ్లెట్లు, క్రీడాకారులంద‌రూ చీర‌ల్లో క‌నిపించి భార‌త‌మాత‌లుగా క‌నిపించేవారు. ఆ విధంగా దేశానికి ఒక గుర్తింపు ఉంది. ఈ చీర క‌ట్టుకొని వ‌స్తే ప్ర‌పంచ దేశాలంద‌రిలో క‌న్నా మ‌న దేశం ప్ర‌త్యేక గుర్తింపు పొందుతుంది. చీర అంటే నే భార‌త‌దేశం గుర్తుకు వ‌చ్చేలా ఉంది. ఇప్పుడు దాన్ని మార్చేసి చీర‌ల స్థానంలో ప్యాంటు, కోటు ఎంపిక చేశారు. ఈ నిర్ణ‌యం భార‌త ఒలింపిక్ స‌మాఖ్య (ఇండియాన్ ఒలింపిక్ ఫెడ‌రేష‌న్ – ఐఓఎఫ్‌) నిర్ణ‌యం తీసుకుంది.

కామన్వెల్త్‌, ఆసియా గేమ్స్‌, ఒలింపిక్స్‌లాంటి అంతర్జాతీయ టోర్నీల్లో భారత క్రీడాకారిణీలు ఇప్ప‌టిదాకా చీర కట్టుతో జాతీయ జెండాను చేత పట్టుకుని ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారు. ఇప్పుడు క్రీడాకారిణీలు అంతా చీరలకు బదులు కోట్లు, ప్యాంట్లు ధరించి కనిపిస్తారు.

‘ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభమ‌వుతాయి. ఈ టోర్నీ ప్రారంభ వేడుకల్లో భారత బృందంలోని మహిళా క్రీడాకారిణీలు ఎప్పటిలా చీరలు ధరించడం లేదు. వాటి స్థానంలో కోట్లు, ప్యాంట్లు ధరిస్తారు అని భారత ఒలింపిక్‌ సమాఖ్య ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్‌ మెహతా తెలిపారు. అయితే ఈ నిర్ణ‌యం అథ్లెట్లను సంప్రదించే తీసుకున్నార‌ట‌.

ప్రారంభ వేడుక‌లు దాదాపు నాలుగైదు గంట‌ల పాటు కొన‌సాగుతాయి. ఈ స‌మ‌యంలో అన్ని గంట‌ల క్రీడాకారిణిలు చీర‌తో ఇబ్బందులు పడుతున్నట్లు వారి దృష్టికి వెళ్లిందంట‌. వారి క‌ష్టం గ‌మ‌నించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఎక్కువ మంది అమ్మాయిలకు చీర కట్టుకోవడం రాక‌పోవ‌డం.. చీర క‌ట్టుకునేందుకు తోటి వారి సాయం తీసుకోవ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకునే కామన్వెల్త్‌ గేమ్స్‌లో కోట్లు, ప్యాంటు ధరించేలా నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -