Thursday, May 2, 2024
- Advertisement -

ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి ధోనినే స్వతహాగా తప్పుకోవాలంటూ సూచించిన లక్ష్మణ్ ….

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనిపై విమ‌ర్శ‌లు మొద‌ల‌వుతున్నాయి. దీనిలో భాగంగానె 20 ఫార్మాట్ నుంచి టీమిండియా జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇక తప్పుకునే సమయం ఆసన్నమైందని అంటున్నాడు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి ధోనినే స్వతహాగా తప్పుకోవాలంటూ లక్ష్మణ్ సూచించాడు. ఈ పొట్టి ఫార్మాట్ నుంచి ధోని తప్పుకుని యువ క్రికెటర్లు ఆడేందుకు అవకాశం కల్పించాలన్నాడు.

కేవలం వన్డే ఫార్మాట్ కు మాత్రమే పరిమితమై ట్వంటీ 20ల నుంచి వైదొలిగే ఆలోచనను ధోని పరిశీలిస్తే బాగుంటుందని లక్ష్మణ్ స‌ల‌హాలిచ్చారు. ట్వంటీ 20ల్లో ధోని నాల్గో నంబర్ లో బ్యాటింగ్ కు వస్తున్నాడు. అయితె ఆస‌మ‌యంలో క్రీజ్‌లో నిల‌దొక్క‌కోవ‌డానికి కొంత స‌మ‌యం కావాలి..కాని టీ20 ల‌లో మాత్రం అలా కుద‌ర‌దు. కివీస్‌తో శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో ఒకవైపు విరాట్ కోహ్లి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తే, ధోని మాత్రం స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఇబ్బంది ప‌డిన సంగ‌తి తెలిసిందే.

టీ20 మ్యాచ్‌లో కోహ్లి స్ట్రైక్ రేట్ 160 ఉండగా, ధోని స్టైక్ రేట్ 80 మాత్రమే ఉంది. టీమిండియా భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఈ తరహా బ్యాటింగ్ సరిపోదు. టీ 20ల నుంచి ధోని తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలి’అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. మ‌రి దీనిపై ధోని ఇత‌ర ఆట‌గాల్ల‌నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -