Sunday, May 19, 2024
- Advertisement -

నెంబ‌ర్ వన్‌గా కొన‌సాగ‌డంపైనె దృష్టిఅంతా…ర‌హానే

- Advertisement -

టీమిండియా స్వ‌దేశంలో జ‌రిగె శ్రీలంక‌తో సిరీస్ అడేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఈ సిరీస్ అనంత‌రం క‌ఠిన‌మైన సిరీస్ ద‌క్షిణాప్రికాతో ఆడ‌నుంది. శ్రీలంక సిరీస్ త‌ర్వాత అత్యం క‌ఠిన‌మైన సిరీస్ అని టీమిండియా ఆట‌గాల్లు తెలిపారు. ఆ సిరీస్ దృష్ట్యా లంక సిరీస్‌ చాల ముఖ్యమని టీమిండియా టెస్టుల వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే అభిప్రాయపడ్డారు.

ఈనెల 16 నుంచి శ్రీలంతో తొలి టెస్ట్ సంద‌ర్భంగా ఈడెన్‌ గార్డెన్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడారు. టెస్టుల్లో నెం 1గా కొన‌సాగుతున్నామ‌ని ప్ర‌తీ సిరీస్ ముఖ్య‌మైన‌దేన‌ని తెలిపారు. చ్చే ఏడాది ప్రారంభంలో కఠినమైన సిరీస్‌ దక్షిణాఫ్రికా పర్యటన ఉంది. అక్కడ రెండు నెలలపాటు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నారు.

శ్రీలంకను తక్కువ అంచనా వేయడం లేద‌ని మా బలాలపైనే పూర్తిగా దృష్టి సారించాం. ఆటగాళ్లంతా అన్ని ఫార్మట్లకు దగ్గట్లు సిద్దం అవుతున్నారు. ఒత్తిడి, అలసటను తగ్గించుకోవడానికి మసాజ్‌, ఈత, ఐస్‌ బాత్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నాం. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మా ఫిట్‌నెస్‌పై కేర్‌ తీసుకుంటుంది.’ అని రహానే పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -