Saturday, May 18, 2024
- Advertisement -

ఆ విషయంలో కోహ్లీ తర్వాతి స్థానం సింధూదే…..

- Advertisement -

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించడంతో సింధూ బ్రాండ్ వాల్యూ జాతీయంగా,అంతర్జాతీయంగా ఒక్క సారి పెరిగిపోయింది. ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం ఆమె ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన వారి వివరాలు, అత్యంత ఆదాయం అందుకుంటున్న వారి గురించి ప్రతి సంవత్సరం ‘ఫోర్బ్స్‌’ ప్రపంచ వ్యాప్తంగా ఓ లిస్ట్‌ని విడుదల చేస్తూ ఉంటుంది.ఫోర్బ్స్‌ క్రికెటర్‌ల జాబితాలో బ్యాడ్మింటన్‌ దిగ్గజం, మన హైదరాబాదీ పీవీ సింధు చేరడం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ అత్యంత ఆదాయం పొందుతూ ఉమెన్‌ కేటగిరిలో 7వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది. జనవరిలో విడుదల చేసిన లిస్ట్‌లో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ ‘మెడిసన్‌ కీస్‌’తో పాటు ప్రపంచవ్యాప్తంగా పీవీ సింధు 13వ స్థానంలో ఉండటంగమనార్హం.

ఫోర్బ్స్‌ లిస్ట్‌ను పరిశీలిస్తే క్రీడారంగం నుంచి క్రికెటర్‌లే అధికంగా కనిపిస్తారు. ప్రస్తుతం పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ తను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నుంచి రోజు వారి ఆదాయం రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. దేశంలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నారు.ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో రోజుకు దాదాపు రూ.1.50 కోటి తీసుకుంటూ ద్వితీయ స్థానంలో నిలిచింది సింధు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -