Tuesday, May 21, 2024
- Advertisement -

భార‌త్‌సాయం కోసం పాక్ గుండె కొట్టు కుంటోంది..

- Advertisement -

పాకిస్థాన్‌కు హాకీ వరల్డ్ కప్ సాధించి పెట్టిన దిగ్గజ ఆటగాడు మన్సూర్ అహ్మద్ గుండె భార‌త్ సాయం కోసం కొట్టుకుంటోంది. హాకీ గోల్ కీపర్ గా మూడు ఓలింపిక్ పతకాలతో పాటు, ఆ దేశానికి ఎన్నో విజయాలను అందించిన మన్సూర్ అహ్మద్ దిగ్గజ క్రీడాకారుడిగా నీరాజనాలు అందుకున్నాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లోనూ భారత్ తనకు సాయం చేస్తుందనే ఆశాభావాన్ని ఈ మాజీ హాకీ కెప్టెన్ వ్యక్తం చేస్తున్నాడు.

గుండె బలహీనంగా ఉండటంతో నాలుగైదేళ్ల క్రితం మన్సూర్ సర్జరీ చేయించుకున్నాడు. స్టంట్లు వేసినా సమస్య మళ్లీ తిరగబెట్టింది. దీంతో గుండె మార్పిడి ఒక్కటే మార్గమని కరాచీ డాక్టర్లు చెప్పారు. చికిత్స కోసం భారత్ లేదా కాలిఫోర్నియా వెళ్లాలని డాక్టర్లు సూచించారు.

దీనిపై స్పందించిన మన్సూర్, తాను శస్త్రచికిత్స కోసం భారత్‌ వెళ్లాలనుకుంటున్నానని తెలిపాడు. భారత్ లోనే ఈ శస్త్రచికిత్స సక్సస్‌ రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. కాలిఫోర్నియాతో పోలిస్తే భారత్ లో ఖర్చు కూడా తక్కువని చెబుతూ, దయచేసి తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు. తాను ఆర్ధిక సాయం కోరడం లేదని, నైతిక సాయం కావాలని కోరాడు. ఇప్పటికే తన ఆసుపత్రి రిపోర్టులను ఇండియన్ ఎంబసీకి పంపించానని, తనకు వీసా కావాలని కోరాడు.

గతంలో తాను ఎంతో మంది భారతీయుల గుండెల్లో బాధను నింపానని తెలిపాడు. 1989లో ఇందిరా గాంధీ కప్‌ టోర్నీలో భారత్‌ ను ఓడించామని గుర్తు చేసుకున్నాడు. ఇంకా ఎన్నో టోర్నీల్లో తాము గెలిచి వారి బాధకు కారణమయ్యామని తెలిపాడు. తానిప్పుడు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని అన్నాడు.

ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నా.. పాకిస్థాన్ జాతీయులకు భారత్ మెడికల్ వీసాలు ఇస్తుండటంతో ఆయకు కూడా భారత్ వీసా జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అహ్మద్‌కు పంజాబ్ ప్రావిన్స్ సీఎం లక్ష డాలర్ల ఆర్థిక సాయం మంజూరు చేశారు. పెద్ద మ‌న‌సుతో త‌న‌కు వీసా మంజూరు చేయాల‌ని కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -