Tuesday, May 21, 2024
- Advertisement -

టీమిండియా ఆడబోయే తర్వాతి సీరిస్ లు ఇవే!

- Advertisement -

ఒకవైపు ప్రపంచ క్రికెటర్లు అంతా ఐపీఎల్ తో బిజీగా ఉన్నారు. ఈ కాసుల క్రికెట్ లీగ్ లో చోటు దక్కని.. ఆడే అవకాశం లేని వారు మాత్రం తమ తమ జాతీయ జట్లకు ఆడుతున్నారు.

ఒకవైపు బంగ్లాదేశ్ ,పాకిస్తాన్ ల మధ్య వన్డే సీరిస్ జరుగుతోంది. ఈ సీరిస్ లో ఒకింత సంచలన ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటికే వరసగా రెండు మ్యాచ్ లలో గెలిచి బంగ్లా వన్డే సీరిస్ ను సొంతం చేసుకొంది. ప్రపంచకప్ లో ఫెయిల్యూర్ తర్వాత చాలా మార్పులతో బరిలోకి దిగినా..పాక్ తేడా చూపలేకపోయింది.

ఇంకోవైపు ఇంగ్లండ్ , వెస్టిండీస్ ల మధ్య టెస్టు సీరిస్ జరుగుతోంది. ఐపీల్ హడావుడిలో ఆ అంతర్జాతీయ మ్యాచ్ లకు అంత కవరేజీ కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో యాక్టివ్ పార్టిసిపెంట్లు అయిన టీమిండియా క్రికెటర్లు ఈ లీగ్ పూర్తయిన తర్వాత ఆడబోయే సీరిస్ లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. జూన్ వరకూ మనోళ్లకు ఎలాంటి సీరిస్ లు ఉండబోవు.

జూన్ లో టీమిండియా బంగ్లాదేశ్ టూర్ వెళుతుంది. ఒక టెస్టు మ్యాచ్ మూడు వన్డేలు ఆడుతుంది. ఆ తర్వాత జింబాబ్వేకు వెళుతుంది టీమిండియా. అక్కడ మూడు వన్డేలు రెండు టీ ట్వంటీలు ఆడి జూలైను పూర్తి చేస్తుంది. ఆగస్టులో ఇండియా, శ్రీలంక ల మధ్య టెస్టు సీరిస్ ఉంది. శ్రీలంక వేదికగా మూడు మ్యాచ్ లు జరుగుతాయి. సెప్టెంబర్ ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ ఉంటుంది. అప్పుడు ఆలీగ్ లో ఆడని ఆటగాళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. అక్లోబర్ నవంబర్ లో ఇండియా ఒక కీలక సీరిస్ ను ఆడుతుంది. దక్షిణాఫ్రికా జట్ఉట ఇండియాకు వస్తుంది. ఇండియా సౌతాఫ్రికాల మధ్య నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ ట్వంటీ మ్యాచ్ లుఉంటాయి.

ఇక టీమిండియాతో ఆడటానికి ఉత్సాహం చూపిస్తూ.. యూఏఈ వేదికగా మూడు టెస్టులు, ఐదు వన్డేలకు ప్లాన్ చేసింది పాక్ క్రికెట్ బోర్డు. అయితే ఇది కన్పర్మ్ కాలేదు. పాక్ తో సత్సంబంధాలు లేని నేపథ్యంలో ఈ సీరిస్ జరుగుతుందా? లేదా? అనేది అనుమానమే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -