Sunday, April 28, 2024
- Advertisement -

యువ ఆటగాళ్లదే టీమిండియా!

- Advertisement -

టీమిండియాలో సీనియర్ల శకం అయిపోయిందా..?, యువ ఆటగాళ్ల భీకర ఫామ్ చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న టీమిండియా జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ,జడేజా,అశ్విన్ మినహా అంతా యువ, కొత్త ఆటగాళ్లే.

యువ ఆటగాళ్లు భీకర ఫామ్‌లో ఉండటంతో ఇక టీమిండియా భవిష్యత్ వారిదేనని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయం పడుతున్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురేల్, గిల్ అద్బుతంగా రాణిస్తున్నారు.

ఇక ముఖ్యంగా జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో అదరహో అనిపించాడు. ఆరంగేట్ర మ్యాచ్ తోనే ఆఫ్ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ అందరిని ఇంప్రెస్ చేశాడు. ఇక వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఒత్తిడిలోనూ అనుభవజ్ఞుడైన ఆటగాడిలా రాణించాడు. నాలుగో టెస్టు విజయంలో జురెల్ పాత్ర కీలకం. దీంతో ఇప్పుడు సీనియర్‌ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్ లాంటి వారికి యువ ఆటగాళ్లతో పోటీ తప్పేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -