Saturday, May 18, 2024
- Advertisement -

ఐసీసీ స్పందనతో సద్దుమణిగిన కోహ్లీ వివాదం…..

- Advertisement -

పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ విరాట్ కోహ్లీ సేన ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమకు గతంలో సాధ్యంకాని విజయాన్ని సాధించి, టీమిండియా ఆస్వాదిస్తుండగా కెప్టెన్ కోహ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. డగౌట్ లో జట్టు సభ్యులతో కూర్చున్న కోహ్లీ వాకీ టాకీ వాడకంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.

అయితె ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ప్రవర్తించాడంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది. డగౌట్ లో కానీ, డ్రెస్సింగ్ రూమ్ లో కానీ ఆటగాళ్లను సంప్రదించేందుకు జట్టు సహాయక సిబ్బంది వాకీటాకీ ఉపయోగిస్తుంటారు. మరోపక్క, కోహ్లీ వ్యవహారం ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు కూడా అనుమానాలను రేకెత్తించింది.

దీనిపై ఐసిసి వివిర‌ణ ఇవ్వ‌డంతో వివాదం స‌ద్దుమ‌నిగింది. వాకీ టాకీ వినియోగించడానికి భారత కెప్టెన్ కోహ్లీ సంబంధిత అధికారిని అడిగి పర్మిషన్ తీసుకున్నారని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఐసీసీ అవినీతి నిరోధక భద్రతా విభాగం అనుమతితోనే కోహ్లీ వాకీ టాకీలో సంభాషించాడని వెల్లడించడంతో వివాదం సద్దుమణిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -