Tuesday, May 21, 2024
- Advertisement -

మెల్‌బోర్న్ పిచ్‌కి త‌క్కువ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ..

- Advertisement -

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నాలుగో టెస్టు ఆడిన మెల్‌బోర్న్ పిచ్‌కి ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చింది. గత శనివారం ముగిసిన ఈ టెస్టులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ శతకాలు బాదగా.. ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ డబుల్ సెంచరీ సాధించాడు.

బ్యాట్స్‌మెన్‌కి అనుకూలించిన ఈ టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. చివరి టెస్టు గురువారం నుంచి జరగనుంది. మెల్‌బోర్న్‌ పిచ్ నుంచి బౌలర్లకి ఊహించినంత సహకారం లభించలేదు. బౌన్స్ కూడా మీడియంగానే ఉంది. ఐదు రోజుల పాటు పిచ్ స్వభావం మారకున్నా.. మ్యాచ్ కొనసాగినకొద్దీ బంతి నెమ్మదిస్తూ వచ్చింది.

ఇలాంటి పిచ్‌పై బ్యాట్, బంతికి మధ్య సమతూకం దెబ్బతింటుంది. నాలుగో టెస్టులో అతిగా బ్యాట్స్‌మెన్‌కి అనుకూలించడం వల్ల.. బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు’ అని మ్యాచ్ రిఫరీ రంజన్ వివరించారు. పేలవ రేటింగ్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పందించింది. ‘మెల్‌బోర్న్ పిచ్‌కి పూర్ రేటింగ్ ఇవ్వడం మమ్మల్ని నిరాశపరిచింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల స్థాయికి అనుగుణంగా దేశంలోని అన్ని పిచ్‌ల తయారీలో ఇకపై జాగ్రత్తలు తీసుకుంటాం’ అని సీఏ వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -