Saturday, May 18, 2024
- Advertisement -

స‌త్తా చాటిన‌బౌల‌ర్లు ..భార‌త్ విజ‌య‌ల‌క్ష్యం 228

- Advertisement -

వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. అద్భ‌త‌మైన బౌలింగ్ తో స‌ఫారీల‌ను త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేశారు. యుజువేంద్ర చాహల్(4/51), బుమ్రా(2/35), భువీ(2/44) సంచలన బౌలింగ్‌తో విజృంభించడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేసింది. సఫారీల ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్(38: 54 బంతుల్లో 4ఫోర్లు), వాన్ డర్ డుస్సెన్(22), డేవిడ్ మిల్లర్(31), ఫెలుక్వాయో(34) అంతంత మాత్రంగానే రాణించారు. ఆఖరల్లో క్రిస్‌మోరీస్(42), రబాడ(31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 130 ప‌రుగుల‌కే ఆలౌట్ అవుతుంద‌నుకున్న స‌ఫారీలు 227 ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నర్హం.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌ఫారీలు మొద‌టి నుంచి పేవ‌ల ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. బూమ్రా బౌలింగ్ దెబ్బ‌కి ఓపెనర్లు ఆమ్లా(6), క్వింటన్ డికాక్(10)లను 6 ఓవర్లలోపే పెవిలియన్ పంపి భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఆత‌ర్వాత కెప్టెన్ డూప్లెసిస్ ఇన్నీంగ్స్‌ను చ‌క్క‌దిద్ద ప్ర‌య‌త్నం చేసినా సఫారీ సారథిని చాహల్ బౌల్డ్ చేయడంతో ఒత్తిడి పెరిగింది. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును మిల్లర్‌ (31), ఫెలుక్‌వాయో (34), మోరిస్‌ (42), రబాడ (31*) తమ భాగస్వామ్యాలతో రక్షించారు.

89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సఫారీ జట్టు. ఫెషుకాయోతో కలిసి డేవిడ్ మిల్లర్ 46 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ దశలో 40 బంతుల్లో 31 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్… చాహాల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 61 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 34 పరుగులు చేసిన ఫెషుకాయో.. చాహాల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.

చివరి బంతికి ఇమ్రాన్ తాహీర్ అవుట్ కావడంతో సఫారీ జట్టు 227 పరుగులకు పరిమితమైంది. రబాడా 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యజ్వేంద్ర చాహాల్ నాలుగు వికెట్లకు సఫారీ జట్టును దెబ్బ తీయగా… జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకు రెండు, కుల్దీప్ ఓ వికెట్ పడగొట్టారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -