Saturday, May 18, 2024
- Advertisement -

సెమీఫైన‌ల్‌లో భార‌త్ వ‌ర్సెస్ బంగ్లా..

- Advertisement -
India Bangladesh semi final in icc championship 2017

ఇంగ్లండులో జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోపీలో బలహీన శ్రీలంక చేతిలో టీమ్‌ఇండియా అనూహ్య పరాజయం మూట‌క‌ట్టుకొని విమ‌ర్శ‌ల పాల‌య్యింది.సెమీఫైన‌ల్‌కు వెల్లాలంటె సౌతాప్రికా జ‌ట్టుతో చావో రేవో తేల్సిన మ్యాచ్‌లో విరాట్ సేత అద్భుత విజ‌యం సాధించి .ఈమ్యాచ్‌లో అంద‌రూ స‌మిష్టిగా రానించారు.దీంతో సెమీఫైన‌ల్ బెర్త్ క‌రారు చేసుకుంది.

శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లంకతో మ్యాచ్‌లో తేలిపోయిన బౌలర్లు.. ఈసారి బలంగా పుంజుకున్నారు. ఫీల్డర్లూ చిరుతల్లా కదిలారు. బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగించారు. మొత్తంగా టీమ్‌ఇండియా మళ్లీ నిలకడ అందుకుంది. ఇక ప్రత్యర్థి జట్టు కూడా తనదైన ‘నిలకడ’ చూపించింది. ఐసీసీ టోర్నీల్లో ఇక చావోరేవో మ్యాచ్‌ అనగానే చేతులెత్తేసే ఆనవాయితీని దక్షిణాఫ్రికా విజయవంతంగా కొనసాగించింది.

{loadmodule mod_custom,GA1}

ప్రపంచ నంబర్‌వన్‌ జట్టును చిత్తుగా ఓడించిన టీమ్‌ఇండియా.. దర్జాగా ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో దూసుకెళ్లింది. గ్రూప్‌-బిలో అగ్రస్థానం దాదాపుగా భారత్‌దే కాబట్టి.. సెమీస్‌ ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ.
ఛాంపియన్స్‌ ట్రోఫీలో క్వార్టర్స్‌ కాని క్వార్టర్స్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా చెలరేగింది. గ్రూప్‌-బిలో తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో దక్షిణాఫ్రికాను 44.3 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌.. అనంతరం లక్ష్యాన్ని 38 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఐసీసీ టోర్నీలనగానే చెలరేగి ఆడే శిఖర్‌ ధావన్‌ (78; 83 బంతుల్లో 12×4, 1×6) టోర్నీలో భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో అర్ధశతకం సాధించాడు. కెప్టెన్‌ కోహ్లి (76; 101 బంతుల్లో 7×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు.

{loadmodule mod_custom,GA2}

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుదే గ్రూప్‌-బి నుంచి తొలి సెమీస్‌ బెర్తు. భారత్‌ దాన్ని కైవసం చేసుకోగా.. దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక సోమవారం శ్రీలంక-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లదే చివరి సెమీస్‌ బెర్తు. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే నెట్‌రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న శ్రీలంకే ముందంజ వేస్తుంది. నెట్‌ రన్‌రేట్‌లో భారత్‌ (1.370)తో పోలిస్తే లంక (-0.879), పాక్‌ (-1.544) బాగా వెనుకబడి ఉన్నాయి. సోమవారం గెలిచే జట్టు.. నెట్‌రన్‌రేట్‌లో భారత్‌ను దాటడం దాదాపు అసాధ్యమే. కాబట్టి భారతే గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశముంది. గ్రూప్‌-ఎలో రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశే భారత్‌కు సెమీస్‌ ప్రత్యర్థి కావచ్చు.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -