Friday, May 17, 2024
- Advertisement -

రెండో టీ20 టీమిండియాదే..

- Advertisement -


ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లోనూ విజయం సాధించింది టీమిండియా. టీమిండియా విధించిన 236 పరుగల భారీ లక్ష్య చేధనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది. మార్కస్‌ స్టొయినిస్‌ (45) పరుగులు చేయగా స్మిత్‌ (19), షార్ట్‌ (19), మ్యాక్స్‌వెల్‌ (12) విఫలం అయ్యారు. టిమ్‌ డేవిడ్‌ (37), కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (42 నాటౌట్‌) చివర్లో పోరాటం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆసీస్ ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ 25 బంతుల్లో 2 సిక్స్‌లు, 9 పోర్లతో 53 పరుగులు చేయగా రుతురాజ్‌ గైక్వాడ్‌ 43 బంతుల్లో 58, ఇషాన్‌ కిషన్‌ 32 బంతుల్లో 52 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. చివర్లో రింకూ సింగ్‌ 9 బంతుల్లో 2 సిక్స్‌లు,4 ఫోర్లతో 31 పరుగులు చేయడంతో భారత్ 235 పరుగులు చేసింది.

భారత ఇన్నింగ్స్‌లో అబాట్ వేసిన నాలుగో ఓవర్‌లో యశస్వి వరుసగా 4,4,4,6,6తో 24 పరుగులు చేస్తే , అదే అబాట్‌ వేసిన 19వ ఓవర్‌లో రింకూ సింగ్‌ 4,6,4,4,6తో 25 పరుగులు చేశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -