Thursday, May 16, 2024
- Advertisement -

ఆసీస్‌పై గెలిచినా..టీమిండియాకు ఇది గుణపాఠమే!

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటివరకు టైటిల్ ఫేవరేట్‌లో ఉన్న టీమ్‌లు అన్ని అదరగొడుతున్నాయి. అంచనాకు మించి పాకిస్ధాన్, దక్షిణాఫ్రికా,న్యూజిలాండ్ విజయభేరి మోగించాయి. ఈ నేపథ్యంలో హోం గ్రౌండ్స్‌లో ఆడుతున్న భారత్ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా టైటిల్ ఫేవరేటే. అన్ని జట్ల కంటే టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్ లలో మొదటే ఉంటుంది.

ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. ఆసీస్ విధించిన 200 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కొల్పోవడం ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి. వరల్డ్ కప్ ముందు వరకు భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్,ఇషాన్ కిషన్, శ్రేయాస్ ముగ్గురు డకౌటే. దీంతో అసలు భారత్ స్వల్ప లక్ష్యాన్ని చేధిస్తుందా అన్న సందేహం.

కానీ అదృష్టవషాత్తు కోహ్లీ, కేఎల్ రాహుల్ రాణించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే భారత్ భారీ పరాభవాన్ని మూటగట్టుకునేదే. కోహ్లీ 85 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. ఏదిఏమైనా ప్రపంచ కప్ లో భారత్ బోణి కొట్టినా సగటు అభిమానులను మాత్రం నిరాశపర్చిందనే చెప్పాలి. మరి తర్వాతి మ్యాచ్‌లలోపైనా ఇలాంటి తగ’బ్యాటు’ జరగకుండా చూస్తారా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -