Monday, May 20, 2024
- Advertisement -

కోహ్లీపై పెరుగుతున్న విమ‌ర్శ‌లు….

- Advertisement -

దక్షిణాఫ్రికాతో కేప్‌ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు క్రమంగా రెట్టింపవుతున్నాయి. ద‌క్షిణాఫ్రికాను త‌క్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఇండియా బ్యాటింగ్‌లో మాత్రం విఫ‌లం అయ్యింది. దీంతో కోహ్లీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఆటలో మొదటి రోజైన శుక్రవారం పేలవ రీతిలో విరాట్ కోహ్లి (5) ఔటవగా.. విదేశీ గడ్డపై మంచి రికార్డు ఉన్న రహానెని తప్పించి మరీ తుది జట్టులోకి తీసుకున్న రోహిత్ శర్మ (11: 59 బంతుల్లో 1×4) కూడా హోరంగా విఫలమయ్యాడు. దీంతో ఓవర్ నైట్ స్కోరు 28/3తో తొలి ఇన్నింగ్స్‌ని శనివారం కొనసాగించిన భారత్ జట్టు 57 పరుగుల వద్దే నాలుగో వికెట్ రోహిత్ రూపంలో కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన రోహిత్ శర్మ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.

స‌ఫారీ గ‌డ్డ‌పై ర‌హానేకు మంచి రికార్డుఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో రహానెని విస్మరించొద్దు. పేస్ పిచ్‌లపై టెస్టుల్లో అతను మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడని గత రికార్డులు సూచిస్తున్నాయి. మిడిలార్డర్‌లో రహానె ఉంటే టీమిండియా మరింత బలంగా ఉంటుంది’ గత కొంతకాలంగా భారత మాజీ క్రికెటర్లు కెప్టెన్ విరాట్ కోహ్లి సూచిస్తున్నా వాటిని పెడచెవిన పెట్టిన కోహ్లి వన్డే, టీ20 ఫామ్, రికార్డుల్ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మకి తొలి టెస్టులో అవకాశమిచ్చాడు. అయితే.. ఆరంభం నుంచి షాట్ల ఎంపికలో తడబడిన రోహిత్ చివరికి పేలవ రీతిలో పెవిలియన్ చేరాడు.

కగిసో రబాడ విసిరిన ఫుల్ లెంగ్త్‌ బంతిని పాదాలు ముందుకు కదుపుతూ.. రోహిత్ శర్మ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ప్యాడ్స్‌ని తాకింది. శనివారం తొలి సెషన్‌లో అలాంటి బంతుల్నే చతేశ్వర్ పుజారాకి రబాడ వేయగా.. అతను పాదాలను వెనక్కి, ముందుకు కదిలించకుండా డిఫెన్స్ చేస్తూ కనిపించడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -