Thursday, May 16, 2024
- Advertisement -

ఉత్కంఠ‌పోరులో ఆసిస్ విజ‌యం…భార‌త్ పాలిట విల‌న్ ఉమేష్

- Advertisement -

విశాఖ‌లో జ‌రిగిన మొద‌టి టీ20లో ఆసిస్ విజ‌యం సాధించింది.ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆసీస్‌నే విజయం వరించింది. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌టీమిండియా త‌క్కువ స్కోరు చేసింది. ఆసిస్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో టీమిండియా 126 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. తొలి బంతి నుంచి ఇబ్బంది పడుతూ ఆడిన రోహిత్ శర్మ (5) బెహ్రెండార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఔటయ్యాడు. రోహిత్ ఔటైనా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (50) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (24)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్ద‌రు క‌ల‌సి 55 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. 69 పరుగుల వద్ద కోహ్లీ వికెట్‌ను కోల్పోయిన టీమిండియా అక్కడి నుంచి వరసపెట్టి వికెట్లను పారేసుకుంది. అన‌వ‌స‌ర‌మైన ప‌రుగుకు తొంద‌ర‌ప‌డి పంత్ వికెట్ ర‌నౌట్ అయ్యాడు. త‌ర్వాత ఒకే ఓవర్‌లో కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్‌ (1)ను కౌల్టర్‌నైల్ పెవిలియన్‌కు పంపాడు. క్రునాల్ పాండ్య (1), ఉమేశ్ యాదవ్ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. ధోనీ (29 నాటౌట్) చివరి వరకూ ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

126 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసిస్ ఆప‌సోపాలు ప‌డుతూ చివ‌ర‌కు విజ‌యం సాధించింది. ఆసీస్‌కు కూడా ఆదిలోనే దెబ్బ తగిలింది. రెండు వరుస బంతుల్లో మార్కస్ స్టాయినిస్ (1), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (0) ఔటయ్యారు. 5 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది.క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ (56) దూకుడుగా ఆడాడు. ఎడాపెడా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. షార్ట్‌ (37)తో కలిసి మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చావ‌ల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన మాక్స్‌వెల్.. రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొంత సేపటికి షార్ట్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.

ఇక్క‌డ నుంచే మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగాంది. 19వ ఓవర్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో హ్యాండ్స్‌కాంబ్ (13), కౌల్టర్‌నైల్ (4)ను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 14 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే చివ‌రి ఓవ‌ర్ వేసిన ఉమేష్ దారాలంగా ప‌రుగులు ఇవ్వ‌డంతో చివ‌ర‌కు మూడు వికెట్లు తేడాతో ఆసిస్ విజ‌యం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -