Saturday, May 18, 2024
- Advertisement -

కీల‌క స‌మ‌యంలో పాండ్యా నిర్ల‌క్ష్యం …

- Advertisement -

మ్యాచ్‌లో ఆట‌గాల్లు చేసే చిన్న త‌ప్పుల‌కు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి. క‌శ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని జాగ్ర‌త్త‌గా ఆడాల్సి ఉంటుంది. ప్ర‌ధానంగా మ్యాచ్‌లో ర‌నౌట్లు కీల‌క పాత్ర పోషిస్తాయి.

అదే ఒక సీరియస్‌ మ్యాచ్‌లో సిల్లీగా రనౌటైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే సిరీస్‌ను సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో తాజాగా భారత ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చాలా సిల్లీగా రనౌటై విమర్శకుల నోటికి పని చెప్పాడు.

భారత ఇన్నింగ్స్‌లో భాగంగా రబడా వేసిన 68 ఓవర్‌ తొలి బంతిని పాండ్యా మిడాన్‌ వైపు ఆడి సింగిల్‌ కోసం యత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్నఫిలిండర్‌ బంతిని ఆపిన మరుక్షణమే స్టైకింగ్‌ ఎండ్‌ వైపు నేరుగా విసిరి వికెట్లను గిరటేశాడు. కాగా, అప్పటికే సింగిల్‌ కోసం యత్నించి వెనుదిరిగిన పాండ్యా క్రీజ్‌లో చేరే క్రమంలోఅత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అటు బ్యాట్‌ను కానీ, కాలును కానీ క్రీజ్‌లో ఉంచలేదు. ఆ బంతి వికెట్లను తాకే సమయానికి పాండ్యా బ్యాట్ క్రీజ్‌ లోపల ఉన్నప్పటికీ అది గాల్లో ఉంది. దాంతో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వెళ్లడం, పాండ్యా అవుట్‌ కావడం చకచకా జరిగిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -