Saturday, May 18, 2024
- Advertisement -

లంక‌కు 410 ప‌రుగుల‌భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించిన ఇండియా…రెండో ఇన్నింగ్స్ డిక్లెర్డ్‌.. 246/5..

- Advertisement -

ఢిల్లీలో శ్రీలంతో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో భార‌త్ లంక‌ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయిన‌ టీమిండియా 246 పరుగుల‌కే డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ముర‌ళీ విజ‌య్ 7, శిఖ‌ర్ ధావ‌న్ 67, ర‌హానె 10, పుజారా 49, కోహ్లీ 50, రోహిత్ శ‌ర్మ 50 (నాటౌట్‌), ర‌వీంద్ర జ‌డేజా 4 (నాటౌట్‌) ప‌రుగులు చేశారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో ల‌క్మ‌ల్‌, గ‌మేజ్‌, పెరెరా, ధ‌నంజ‌య, శాంద‌న‌క్ ఒక్కో వికెట్టు చొప్పున తీశారు. శ్రీలంక విజ‌యల‌క్ష్యం 410 ప‌రుగులుగా ఉంది.

అంతకుముందు 356/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన లంక 5.3 ఓవర్ల వ్యవధిలోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్‌ వేసిన 135 ఓవర్‌ మూడో బంతికి చండిమాల్‌‌(164) ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటవ్వడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌ ఆదిలోనే రెండు వికెట్లుకోల్పోయింది. మురళీ విజయ్‌(9), అజింక్యా రహానే(10)లు నిరాశపరిచారు. కాగా, పుజారా, ధావన్‌, కోహ్లి, రోహిత్‌ శర్మలు రాణించి భారీ లక్ష్యాన్ని లంకేయులు ముందుంచడంలో సహకరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -