Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ ర‌హ‌స్యాన్ని రిటైర్ అయ్యాక చెబుతా….ధోని

- Advertisement -

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్లతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లేఆఫ్ బెర్త్‌ను ద‌ర్జాగా ఖ‌రారు చేసుకుంది ధోని టీమ్‌. చెన్నై ఆటగాడు షేన్‌ వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్బుత ఇన్నింగ్స్‌తో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ‌రో వైపు జ‌ట్టు యాజ‌మాన్యం త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని కూడా నిల‌బెట్టుకున్నాడు.

ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచుల్లోనూ అంచనాలను అందుకోలేకపోయిన ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌కు అవకాశం కల్పించడంపై ధోని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.గత మ్యాచుల్లో రాణించకలేకపోయినా సరే అతను నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూనే ఉన్నాడు. బంతిని అంచనా వేయడంలో వాట్సన్‌కు కచ్చితత్వం ఉంటుంది. అందుకే జట్టు యాజమాన్యం అతినికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించిందక‌ని చెప్పుకొచ్చారు.

చెన్నై జట్టు విజయ రహస్యం ఏంటని వ్యాఖ్యాత హర్షబోగ్లే ప్రశ్నించగా… కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఫన్నీగా సమాధానమిచ్చాడు. ఒకవేళ అందరికీ ఆ రహస్యాన్ని చెబితే.. వచ్చే ఐపీఎల్‌ వేలంలో చెన్నై యాజమాన్యం తనను కొనుగోలు చేయదని ఫ‌న్నీగా స‌మాధానం ఇచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -