Sunday, May 19, 2024
- Advertisement -

ధోని.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కి దూరమే.. నాకు కావలంటున్న షారుఖ్ ఖాన్

- Advertisement -

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడో అవకాశం ధోని వదులుకోవాల్సిందేనా… అని అంటే అవుననే జవాబు ఎక్కువగా వినిపిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కారణం వల్ల రెండేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్.. మళ్లీ 2018 ఐపీఎల్‌‍లో ఆడేందుకు సిద్దం అయ్యింది.

కానీ.. ఈ రెండేళ్లలో ధోని పుణె సూపర్ జెయింట్ తరఫున ఆడటంతో.. ఆయన తిరిగి చెన్నై తరుపున ఆడే అవకాశాలు దాదాపు చాలా తక్కువే అనే వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వద్ద కొత్తగా ఒక అభ్యర్థనని ఉంచాయి. నిషేధానికి ముందు ఉన్న జట్టులోని ఆటగాళ్లలో.. ఒక భారత క్రికెటర్‌, ఇద్దరు విదేశీ క్రికెటర్లని తాము అట్టిపెట్టుకునే అవకాశం కల్పించాలని అందులో ఈ రెండు ఫ్రాంఛైజీలు కోరాయి.

ఈ అభ్యర్థనని అన్ని జట్ల ప్రాంచైజీలతో నవంబర్ లో జరగనున్న సమావేశంలో ముందు ఉంది.. తుదు నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఫ్రాంఛైజీలు ఒకవేళ ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ కి ధోని దొరకడం కష్టమేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ధోని వేలంలోకి వస్తే.. ఎంతైన పెట్టి కొనుగోలు చేస్తానని ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ తెలిపిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -