Monday, May 20, 2024
- Advertisement -

క్రికెట‌ర్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

- Advertisement -

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే ముందు ఆటగాళ్లకు పెను షాకిచ్చింది బీసీసీఐ. విదేశీ టూర్ల‌కు వెల్లిన‌ప్పుడు కొంద‌రు క్రికెట‌ర్లు స‌తీమ‌నుల‌తోపూ, మ‌రి కొంద‌రు ఉన్న‌ప్పుడు ప్రియసఖులతో స‌మ‌యం దొరికిన‌పుడు షికార్లు చేస్తుంటారు. ఇంగ్లాండు టూర్‌లో కూడా అదే ప‌రిస్థితి క‌న‌ప‌డింది.

అయితే దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావించింది. మూడో టెస్టు దాకా తమ ‘బెటర్‌హాఫ్‌’లకు సెలవియ్యాలని క్రికెటర్లకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చెప్పించింది. ప్రస్తుత ఇంగ్లిష్‌ టూర్‌లో టీమిండియా వన్డే సిరీస్‌ కోల్పోయింది. టెస్టు సిరీస్‌ కూడా కోల్పోతే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించిన బీసీసీఐ గత అనుభవాల దృష్ట్యా తాజా ప్రణయ విహారాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది.

మైదానంలో ఆటగాళ్లు వైఫల్యం చెందడానికి చాలా సందర్భాల్లో వారి కుటుంబీకులే కారణమని విమర్శలు వస్తున్నాయి. టూర్లలో ఎంజాయ్ చేసి వచ్చి బ్యాటు పట్టుకుంటున్నారని, సరైన ప్రాక్టీస్ లేకుండా మ్యాచ్ లు ఆడి ఓడిపోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

విదేశీ పర్యటనల్లో సిరీస్‌లు ఓడిపోతే అభిమానులు, విమర్శకులు ముందుగా దుమ్మెత్తిపోసేది వారి భాగస్వాములపైనే! గత వన్డే ప్రపంచకప్‌ సమయంలో కోహ్లి విఫలమవగానే అనుష్కే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. సామాజిక సైట్లలో కొందరైతే ‘అనుష్క… మా కోహ్లిని విడిచిపెట్టు… అపుడే అతను పాత కోహ్లిలా ఆడతాడు’ అని తీవ్ర స్థాయిలో పోస్ట్‌లు పెట్టారు. ఇలాంటి విమ‌ర్శ‌లు మ‌రో సారి రాకుండా బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -