Sunday, May 19, 2024
- Advertisement -

వరుణుడి దెబ్బ‌కు నిలిచిపోయిన మ్యాచ్ … రెండో రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన లంకేయులు..

- Advertisement -

ఈడెన్‌గార్డెన్‌ వేదికగా జరుగుతున్న భారత్‌-శ్రీలంక తొలి తొలిటెస్టును వరుణుడు వ‌ద‌ల‌డంలేదు. మ్యాచ్ ప్రారంభ‌మ‌యిన ప్ర‌తీసారి వ‌రుణ‌దేవుడు అడ్డంకులు క‌లిగిస్తున్నారు. రెండో రోజు వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. తేనీటి విరామం లేకుండానే భోజన విరామాన్ని ముందుకు తెచ్చారు.

తొలిరోజు మబ్బుల కారణంగా వెలుతురు లేమితో కేవలం రెండు గంటల ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో 12 ఓవర్ల పాటు జరిగిన ఆటలో 17 పరుగులకు మూడు వికెట్లుకోల్పోయింది. రాత్రి వాన తెరిపినివ్వడంతో ఉదయం షెడ్యూల్ సమయానికి మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో 32.5 ఓవర్లపాటు నిరంతరాయంగా కొనసాగిన ఆటకు వరుణుడు అడ్డం పడ్డాడు. దీంతో మ‌రో సారి మ్యాచ్ ఆగిపోయింది.

ఇంతవరకు కొనసాగిన రెండు రోజుల ఆటలో టీమిండియా బ్యాట్స్ మన్ పై లంక బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. తొలి రోజు లక్మల్ నిప్పులు చెరగగా, రెండో రోజు శనక ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

ఆట నిలిచే సమయానికి మరో ఓవర్ నైట్ ఆటగాడు చతేశ్వర పుజారా(47 బ్యాటింగ్;102 బంతుల్లో9 ఫోర్లు), సాహా(6 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలోలక్మల్ మూడు వికెట్లు సాధించగా, షనకకు రెండు వికెట్లు తీశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -