Wednesday, May 15, 2024
- Advertisement -

2019 వ‌ర‌ల్డ్‌ క‌ప్ ఆడే స‌త్తా ధోనీలో ఉంది కోచ్ ర‌విశాస్త్రి….

- Advertisement -

వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి మద్దతుగా నిలిచారు. దీనికి తనదైన శైలిలో బదులిచ్చిన శాస్త్రి.. ఆ విమర్శలు చేసిన వారిపై మండిపడ్డాడు. ఒకసారి ధోనిని విమర్శించే ముందు ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించాడు. అతడి వయసు 36 అయినా 26 ఏళ్ల వారిని ఓడించగలడని అన్నారు. గ‌త కొంత కాలంగా ధోనీ ఫిట్‌నెస్‌పై అనేక మంది విమ‌ర్శ‌లు చేశారు. మహీ బ్యాటింగ్‌లో పస తగ్గిందన్న విమ‌ర్శ‌ల‌ను శాస్త్రి కొట్టిపారేశారు. కాగా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ధోనీ ఎలా ఆడాడో అందరికీ తెలిసిందే.

నలభై ఏళ్లుగా క్రికెట్‌ను చూస్తున్నా. కోహ్లి దశాబ్ద కాలం నుంచి జట్టులో ఉన్నాడు. ఈ వయసులోనూ ధోనీ 26 ఏళ్ల వారితో పోటీపడుతున్న సంగతి మనకు తెలుసు. అతనిపై విమర్శలు చేస్తున్న వారు క్రికెట్‌ ఆడిన సంగతి మరిచిపోయారు. అలాంటి వారు అద్దం ముందు నిల్చొని ధోని వయసులో ఉన్నప్పుడ ఏమి చేశారో తెలుసుకోవాల‌న్నారు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించాడు. సగటు 51. వన్డేల్లో అతని స్థానాన్ని భర్తీచేసే వికెట్‌ కీపర్‌ ఇప్పటి వరకు కనిపించనేలేదు’ అని రవిశాస్త్రి అన్నారు.

ఎంఎస్‌ ధోనీ వికెట్‌ కీపింగ్‌పై బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను రవిశాస్త్రి ఏకీభవించారు. టెస్టు క్రికెట్‌ ఆడనంత మాత్రాన 2019 ప్రపంచకప్‌ ఆడనట్టు కాదని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌ గురించి మాట్లాడారు. ఈ పర్యటన టీమిండియాకు మంచి అవకాశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు భారత్‌ అక్కడ సిరీస్‌ గెలవలేదని కోహ్లీసేనకు ఇది అద్భుత అవకాశమని తెలిపారు.జట్టులో ‘నేను’ అన్న పదమే లేదని ‘మేము’ అని మాత్రమే ఉందన్నారు. జట్టులో ‘నేను’ అన్న పదమే లేదని ‘మేము’ అని మాత్రమే ఉందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -