Thursday, May 16, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భార‌త్‌….

- Advertisement -

శ్రీలంకతో ముంబయిలోని వాంఖడే స్డేడియంలో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ముగిసిన రెండు టీ20ల్లో ఘన విజయం సాధించి.. 2-0తో సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్.. చివరి టీ20లో కూడా గెలిచి లంకేయుల్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవంగా సుదీర్ఘ సిరీస్‌ని ముగించాలని లంక ఆశిస్తోంది.

ఈ ఏడాది భారత్‌ ఆడుతున్న చివరి మ్యాచ్‌ ఇదే. ఈ పోరులో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమిండియా పట్టుదలతో ఉండగా కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక కోరుకుంటోంది. మహ్మద్‌ సిరాజ్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి వచ్చారు

సిరీస్‌ ఇప్పటికే చేజిక్కడంతో భారత్ జట్టులో రోహిత్ శర్మ రెండు మార్పులు చేశాడు. గత రెండు టీ20ల్లో అద్భుతంగా రాణించిన మణికట్టు స్పిన్నర్ చాహల్‌, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రాలకి రెస్ట్ ఇచ్చి.. వారి స్థానంలో 18 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌, హైదరాబాద్ ఆటో డ్రైవర్ కుమారుడు మహ్మద్ సిరాజ్‌కి తుది జట్టులో చోటిచ్చాడు.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), లోకేశ్ రాహుల్, ధోని, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -