Saturday, April 27, 2024
- Advertisement -

చాంపియన్స్ ట్రోఫీపై వీడ‌ని ఉత్కంఠ‌…

- Advertisement -
indian cricket team icc champions trophy

జూన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ప్రాతినిధ్యంపై నెలకొన్న చిక్కుముడి ఇంకా వీడటం లేదు. చైర్మన్ శశాంక్ మనోహర్ తీసుకొచ్చిన ఐసీసీ రెవెన్యూ మోడల్‌ను ఆది నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న బీసీసీఐలోని కొంత మంది ఆధికారులు చాంపియన్స్ ట్రోఫీలో ఆడకుండా ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నేపథ్యంలో ఇప్పటికే పరిపాలన కమిటీ(సీవోఏ) చైర్మన్ వినోద్ రాయ్ కలుగజేసుకుని బోర్డుకు లేఖరాశారు.

అయితే ఈనెల 7న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో భారత క్రికెట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తాము కచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీవోఏ తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు హెచ్చరికతో కూడిన లేఖను రాసింది. కొత్త రెవెన్యూ మోడల్‌పై తిరిగి సంప్రదింపులు జరిపేందుకు ఐసీసీ సిద్ధంగా ఉన్నా..బీసీసీఐ డిమాండ్‌ను ఆమోదించే అవకాశం లేదని లేఖలో పేర్కొంది.
ఆదాయ పంపిణీపై ఐసీసీతో వైరం కాకుండా ముందుగా చర్చల ద్వారా పరిష్కారానికే ప్రాధాన్యమివ్వాలని 10వ పాయింట్‌లో ఉదహరించింది.లేఖలోని 13వ పాయింట్‌లో ‘మొత్తం భారత క్రికెట్‌ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకునే నిర్ణయాలకు సీఓఏ మద్దతిస్తుంది’ అని స్పష్టం చేసింది. మొండి పట్టుదలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శించాలని సీఓఏ ఆ లేఖలో పేర్కొంది. ఎస్‌జీఎమ్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా లోతైన కసరత్తు చేయాలని రాష్ట్ర సంఘాలకు సూచించింది.
ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత్ తప్పుకుంటే..వచ్చే ఎనిమిదేండ్లు ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు మనకు అవకాశం ఉండదు. ఇది కొంత మంది కలిసి తీసుకునే నిర్ణయం కాదు. ఈనెల 7న జరిగే బీసీసీఐ ఎస్‌జీఎమ్ సమావేశంలో దీనిపై చర్చిద్దాం. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమ్‌ఇండియా తప్పనిసరిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే..ఎస్‌జీఎమ్‌లో ఉన్న 30 మంది సభ్యులు ఏకగీవ్రంగా ఓ నిర్ణయానికి వద్దాం అని రాయ్ అన్నారు. ఎస్‌జీఎమ్‌లో మెజారిటీ సభ్యులు గనుక చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికొస్తే..సీవోఏ ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గనిర్దేశకత్వం ప్రకారం నడుచుకునే అవకాశముంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ప్రతి సీజన్‌లోనూ 300 పైచిలుకు పరుగులు
  2. ఐసీసీ బిగ్‌-3 ఆదాయ పంపిణీ కోల్పోయిన బీసీసీఐ
  3. 2022 లో కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో..క్రికెట్‌
  4. ​కష్టాల్లో కొహ్లీ.. అందుకే గంగూలీ సలహాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -