Sunday, May 19, 2024
- Advertisement -

టీ20లో న్యూజిలాండ్‌పై ఖాతా తెరుస్తారా…?

- Advertisement -

మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త జ‌ట్టు 2-1 సీరీస్‌తో అద‌ర‌గొట్టిన సంగ‌తి తెల‌సిందె. ఇప్పుడు టీ20 సిరీస్‌కు ఇరు జ‌ట్లు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది.

వన్డే సిరీస్ ను గెలిచిన ఉత్సాహంతో విరాట్ సేన బరిలోకి దిగుతుండగా, కనీసం టీ 20 సిరీస్ ను సాధించాలనే పట్టుదలతో కివీస్ పోరుకు సిద్ధమవుతోంది. అయితే మూడు వన్డేల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న టీమిండియాకు టీ 20 సిరీస్ ల్లో కూడా గట్టి పోటీ తప్పకపోవచ్చు.

ఈసంత్స‌రం స్వదేశంలో ఆడిన టీ 20 సిరీస్ లు రెండు. జనవరిలో ఇంగ్లండ్ తో జరిగిన మూడు టీ 20ల సిరీస్ ఒకటైతై, ఇటీవల ఆసీస్ జరిగిన మూడు టీ 20ల సిరీస్ మాత్రమే స్వదేశంలో విరాట్ సేన ఆడింది. ఈ రెండు సిరీస్ ల్లోనూ భారత్ కు ప్రత్యర్థి జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.

న్యూజిలాండ్ తో ఇప్పటివరకూ జరిగిన అన్ని టీ 20 మ్యాచ్ ల్లోనూ భారత్ కు నిరాశే ఎదురైంది. 2007 నుంచి చూస్తే కివీస్ తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది. వరల్డ్ టీ 20 ల్లో భాగంగా గతేడాది న్యూజిలాండ్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లో సైతం టీమిండియా పరాజయం పాల‌య్యింది. దీంతో భార‌త్‌పై కివిస్‌కు తిరుగులేని రికార్డు ఉంది.

ఈ టీ20 సిరీస్‌లోనైనా కివీస్ పై ఖాతా తెరిచి ఆ చెత్త రికార్డుకు చెరమగీతం పాడాలని విరాట్ సేన యోచిస్తుండ‌గా మరొకవైపు తమ రికార్డును కొనసాగించేందకు కివీస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. న్యూజిలాండ్ తో జరిగే తొలి టీ 20 మ్యాచ్ భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు చివరి మ్యాచ్ కావడంతో అతనికి చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. త‌న కెరీర్‌కు ముగింపు ప‌లుకుతున్న సంద‌ర్భంగా …చివ‌రిసారిగా న సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లలో న్యూజిలాండ్ తో జరిగే టీ 20 మ్యాచ్ లో వీడ్కోలు చెప్పనున్నట్లు అప్పుడే ప్రకటించాడు. బీసీసీఐ కూడా నెహ్రాను ఘ‌నంగా స‌న్మానించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

జ‌ట్ల వివ‌రాలు…

భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ఆశిష్ నెహ్రా

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, రాస్ టేలర్, గప్టిల్, రాస్ టేలర్, గ్రాండ్ హోమ్, నికోలస్, మిల్నే, మున్రో, సాంత్నార్, టిమ్ సౌథీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -