Sunday, May 19, 2024
- Advertisement -

రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక..

- Advertisement -

నాగ్ పూర్ వేదిక భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్టు తొలిరోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆకట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక బ్యాట్స్ మన్ కు టీమిండియా పేసర్లతో పాటు స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులు వేశారు. లంక బ్యాట్స్ మన్ క్రీజులో స్వేచ్ఛగా కదలలేని విధంగా బంతులేసి పరుగులు నియంత్రించారు. 20 పరుగుల వద్ద సమరవిక్రమ (13) ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్ ను ఛటేశ్వర్ పుజారా అద్భుతంగా ఒడిసిపట్టగా, 25వ ఓవర్ చివరి బంతికి తిరుమన్నె (9) ను బౌల్డ్ చేశాడు.

దీంతో శ్రీలంక జట్టు లంచ్ విరామ సమయానికి 47 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ చెరి ఒక వికెట్ తీశారు. తొలి టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయని స్పిన్నర్లు రెండో టెస్టులో ప్రభావం చూపుతున్నారు.

మోద‌ట ఓపెన‌ర్ క‌రున ర‌త్నె రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.క్రమంలో ఓపెనర్‌ కరుణరత్నే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 18.4 వద్ద కరుణరత్నే తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న కరుణరత్నే పరుగు కోసం యత్నించాడు. ఇంతలో బంతిని అందుకున్న పుజారా దాన్ని నేరుగా వికెట్లకు విసిరాడు. భారత ఆటగాళ్లు ఔట్‌ అప్పీల్‌ చేయగా థర్డ్‌ అంపైర్‌ రివ్యూలో దాన్ని నాటౌట్‌గా తేల్చారు. అనంతరం 20.4 వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లోనే మరోసారి కరుణరత్నే ఔట్‌ నుంచి తప్పించుకున్నాడు. కరుణరత్నే బంతిని గాల్లోకి లేపగా పుజారా క్యాచ్‌ జార విడిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -