Sunday, May 19, 2024
- Advertisement -

సీమాంత‌ర ఉగ్ర‌వాదానికి పాక్ స్వ‌స్తి ప‌ల‌కాలి…

- Advertisement -

 

Vijay Goel says India Pakistan can’t play until terrorism stops

పాకిస్థాన్ పీసీబీకి భార‌త్ గ‌ట్టి షాకిచ్చింది. ఇప్ప‌టికే పాకిస్థాన్ తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ కోసం ఐసీసీని అడ్డం పెట్టుకుని పాక్ ఎన్నో ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన సందర్భంగా కూడా పాక్ తో క్రికెట్ ఆడేందుకు అనుమతి కోరి, ఆతిథ్యం తామిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్ర‌స‌క్తే లేద‌ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజ‌య్ గోయెల్ స్ప‌ష్టంచేశారు. పాకిస్థాన్ నుంచి ఉగ్ర దాడులు ఆగేవ‌ర‌కు క్రికెట్ మాట ఎత్తేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. పాకిస్థాన్ బోర్డుకు బీసీసీఐ ఏదైనా హామీ ఇచ్చే ముందు ప్ర‌భుత్వంతో మాట్లాడాల‌ని ఆయ‌న అన్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్ర‌స్తుతం దుబాయ్‌లో బీసీసీఐ, పీసీబీ మ‌ధ్య జ‌రుగుతున్న మీటింగ్‌పై ఆయ‌న ఇలా స్పందించారు. పాక్‌తో క్రికెట్ సంబంధాల‌ను తామేమీ వ్య‌తిరేకించ‌డం లేద‌ని ఇంత‌కుముందు బీసీసీఐ చెప్పిన విష‌యం తెలిసిందే. పాక్ తో క్రీడా సంబంధాలను కొనసాగించేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపిన ఆయన, ముందు పాక్ తీరు మారాల్సి ఉందని ఆయన చెప్పారు.గ‌తంలో పాక్‌తో సిరీష్‌లు ఆడేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి కోస‌మే చూస్తున్న‌ట్లు బోర్డు సెక్ర‌ట‌రీ అమితాబ్ చౌద‌రీ అన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో దుమ్ము రేపిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు
  2. ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భార‌త జ‌ట్టుకు స‌చిన సందేశం
  3. ఐసీసీ ఛాంఫియ‌న్స్ ట్రోపి జ‌ట్టు ఇదే.
  4. స‌చిన్‌కు తొలిసారి బ్యాట్‌ను ఇచ్చింది ఎవ‌రు….

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -