Saturday, May 18, 2024
- Advertisement -

వైర‌ల్ అవుతున్న కోహ్లీ నిర్ణ‌యం…. నెట‌జ‌న్ల‌నుంచి ప్ర‌శంశ‌లు…

- Advertisement -

శ్రీలంక‌తో జ‌రిగిని మొద‌టి టెస్ట్ డ్రా అయిన సంగ‌తి తెలిసిందే. భార‌త్ విజ‌యాన్ని సూర్చుడు అడ్డుకోవ‌డంతో లంక ఓట‌మినుంచి బ‌తికిపోయింది. గెలుపు చివ‌రి ద‌శ‌లో లైటింగ్ లేని కార‌నంగా ఆట‌ను డ్రాగా ప్ర‌క‌టించారు అంపైర్లు.

అయితె రెండో ఇన్నీంగ్స్‌లో విరాట్ కోహ్లీ తీసుకున్న ఒక నిర్ణ‌యం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. మొద‌టి ఇన్నీంగ్స్‌లో డ‌కౌట్ అయిన కోహ్లీ రెండో ఇన్నీంగ్స్‌లో సెంచ‌రీ సాధించాడు. అయితె ఎవ‌రికి తెలియ‌ని విష‌యం ఏంటంటె కోహ్లీ వ్యక్తిగత స్కోరు 97 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేయాలా? అని ఫీల్డ్ బయట ఉన్న కోచ్‌ రవిశాస్త్రిని కెప్టెన్ కోహ్లీ అడగటం గమనార్హం.

టెస్ట్ చివరిరోజు కావడంతో తమ బౌలర్లకు ప్రత్యర్థి జట్టు లంక ఆటగాళ్లకు ఔట్ చేసేందుకు సమయం ఉంటుందో లేదోనని కోహ్లీ ఆ నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఆ సెంచరీ చేస్తే కోహ్లీ ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులు చేరతాయని తెలిసినా.. బౌలర్లకు ఎక్కువ సమయం ఇవ్వాలని భావించాడు. సెంచరీ కోసం మరికొన్ని బంతులు ఆడితే మ్యాచ్ ఫలితం ఆశించినట్లుగా రాదని భావించిన కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రికి సంకేతాలు పంపగా.. వద్దు మరో ఓవర్‌ ఆడి సెంచరీ పూర్తిచేసుకో.. అప్పుడు ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్ చేయ్ మంటూ రిప్లై వచ్చింది.

తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన కెప్టెన్, రెండో ఇన్నింగ్స్‌లో శతకం (104) బాది అన్నిఫార్మట్లలో కలిపి 50 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. జట్టు కోసం కోహ్లీ సెంచరీని వదులుకోవడానికి సిద్ధపడ్డాడంటూ క్రికెట్ ప్రేమికుల నుంచి భారీగా కామెంట్లు వస్తున్నాయి. సోషియ‌ల్ మీడియాలో నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంశ‌లు వెల్లు వెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -