Friday, May 17, 2024
- Advertisement -

రిటైర్‌మెంట్‌పై కోహ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

టీమిండియాను విజ‌య‌ప‌థంలో నడిపిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, అయితె క్రికెట్ ఆడ‌టంపై సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేశారు. అప్పుడే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతా’ అంటున్నారు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ. నవంబర్‌ 5 ఆయన పుట్టినరోజు. 29వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా వెబ్‌ టాక్‌ షో ‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌’లో తన రిటైర్మెంట్‌ ప్రణాళికల గురించి ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేశారు.

టీమిండియా విజయాలు సాధించ‌డ‌మే త‌నకు ప్రేరణ అని,ఆటపై అభిరుచి పోయిన మరుసటి రోజే క్రికెట్‌ ఆడటం మానేస్తాన‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. త‌న‌ శరీరం సహకరించినన్ని రోజులు ఆటను ఆస్వాదిస్తాన‌ని అన్నాడు. అలా లేనప్పుడు తానిక క్రికెట్‌లో ఉండ‌బోన‌ని చెప్పాడు. ఆటపై అనురక్తి లేకుండా తాను నిద్రలేచిన రోజులు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. పట్టుదలతో శ్రద్ధగా ఆడి దాన్ని అధిగమించానని తెలిపాడు.

వెన్నుతట్టి ప్రోత్సహించే వారుంటే ఓట‌ముల‌ భారం తగ్గుతుందని, మళ్లీ విజ‌యం సాధించేవ‌రకు ప్రయత్నించాలని అనిపిస్తుందని విరాట్ కోహ్లీ తెలిపాడు. క్రీడాకారులకు ఇది ఎంతో అవసరమ‌ని ఆయ‌న పేర్కొన్నాడు. గెలిపించే సత్తా లేదనిపించినప్పుడు నేను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతా’ అని కోహ్లీ అన్నారు. విరాట్ కోహ్లీ సార‌థ్యంలో, మెరుగైన ఆట‌తీరుతో టీమిండియా విజ‌యాల‌తో దూసుకుపోతోంది. కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న విరాట్‌ వరుసగా దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -