Wednesday, May 22, 2024
- Advertisement -

లార్డ్స్ ఓట‌మిపై కోహ్లీ ఎమోష‌న‌ల్ పోష్ట్‌….

- Advertisement -

మొద‌టి టెస్ట్ ఓట‌మి త‌ర్వాత రెండో టెస్ట్‌లోకూడా గుణ‌పాఠం నేర్చుకోలేదు కోహ్లీ టీమ్‌. అభిమానులు పెట్టుకున్న ఆశ‌ల‌ను వ‌మ్ముచేస్తున్నారు. టార్డ్స్‌లో జ‌రిగిన రెండో టెస్ట్‌లో దారుణమైన పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది టీమిండియా జ‌ట్టు.

ముఖ్యంగా లార్డ్స్ టెస్ట్‌లో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కోహ్లిని కూడా వదలకుండా అభిమానులు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అటు బీసీసీఐ కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. ఈ నేప‌థ్యంలో రెండో టెస్టులో ఘోర ఓటమి అనంతరం కోహ్లీ తన ఫేస్‌బుక్‌లో భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును అభిమానులతో పంచుకున్నాడు.

కొన్ని సందర్బాల్లో విజయాల రుచిని ఎలా చూస్తామో.. మరికొన్ని సందర్భాల్లో ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నాడు. తాము ఎప్పుడూ విజయం కోసమే మాత్రమే ఆడతామన్న కోహ్లి.. తమపై నమ్మకం ఉంచాలని అభిమానులను కోరాడు. తమకు అండగా ఉండాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు. జట్టుగా అలరించడానికి వందశాతం యత్నిస్తామని కోహ్లి వాగ్దానం చేశాడు. ఎత్తుపల్లాలు సహజమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

‘మేము చేసిన తప్పుల్ని అంగీకరిస్తున్నాం. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం తప్ప చేసేదేమీ లేదు. మళ్లీ అవే పొరపాట్లకు చోటివ్వాలని అనుకోవడం లేదు. మూడో టెస్టులో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాం’ అని లార్డ్స్‌ ఓటమి తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌ కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు.

వచ్చే శనివారం నుంచి ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడితే సిరీస్ కోల్పోతుంది. అదే జరిగితే కెప్టెన్ కోహ్లితోపాటు కోచ్ రవిశాస్త్రిపై కూడా కఠిన చర్యలకు బీసీసీఐ సిద్ధమవుతున్నది. మరోవైపు కోహ్లి వెన్నుగాయంతో బాధపడుతుండటంతో మూడోటెస్ట్‌కు ఆడటం అనుమానంగా మారింది. ఒకవేళ కోహ్లి మిస్ అయితే అతని స్థానంలో అశ్విన్ కెప్టెన్సీ చేపట్టే అవకాశం ఉంది.

https://www.facebook.com/virat.kohli/posts/1882345588519202

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -