Friday, May 17, 2024
- Advertisement -

తొలి సెమీస్‌ ..రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా?

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో టాప్ 4 ప్లేస్‌లు కన్ఫామ్ అయ్యాయి. తొలి సెమీస్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తలపడనుండగా , రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.ఈనెల 15న ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా తొలి సెమీస్‌ జరగనుండగా నవంబర్‌ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా రెండో సెమీస్‌ జరుగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిచిన వారు నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో తలపడనున్నాయి.

ఇక న్యూజిలాండ్ – భారత్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఎందుకంటే 2019 వన్డే సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలోనే ఓటమి పాలైంది టీమిండియా. దీంతో ఈసారి కివీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో దారుణంగా ఓటమి పాలైంది పాక్. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్…43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించింది. ఇంగ్లాండ్ సెమీస్ చేరాలంటే ఆ లక్ష్యాన్ని పాకిస్థాన్ 6.2 ఓవర్లలోనే ఛేదించాల్సి వచ్చింది. అయితే ఇది ఏ దశలోనూ సాధ్యం కాని పరిస్థితి ఉండటంతో పాక్ ఓటమి తప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -