Thursday, May 16, 2024
- Advertisement -

నేరం రుజువైతే 5 సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌

- Advertisement -
Babri Masjid demolition case

1992 లో జ‌రిగిన బాబ్రీమ‌షీదు విధ్వంసం  దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో వంద‌రికీ తెలిసిందే.  ఈకేసులో ప్ర‌ధానంగా బీజేపీ అగ్రనేత‌ల‌యిన అద్వానీ,ఉమాభార‌తి,ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, అప్ప‌టి యూపీ సీఎం క‌ళ్యాణ్‌సింగ్‌తో స‌హా 13 మంది బీజేపీ సీనియర్‌ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈకేసు విచార‌ణ నిమిత్తం 2010లో రాయ‌బ‌రేలి కోర్టు  బీజేపీ నేత‌ల‌ను  కోర్టు నిర్ధోషిగా ప్ర‌క‌టించింది. అయితే ఈతీర్పును అలహాబాద్‌ హైకోర్టు కూడా  సమర్థించింది.అయితే సీబీఐ మాత్రం  సుప్రీంకోర్టును మ‌రో్సారి ఆశ్ర‌యించింది.

కేసును విచారించిన సుప్రీం కోర్టు    బీజేపీ అగ్రనేత‌లు అయిన అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, ఉమాభార‌తి పై అప్ప‌ట్లో జ‌రిగిన బాబ్రీ మ‌సీదు  విధ్వంసం కేసులో  విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. వీరంద‌రిపై  న‌మోద‌యిన అభియేగాలు రుజువైతే క‌నీసం  ఐదు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌ప‌డే అవ‌కాశం ఉంటందంటున్నారు విశ్లేష‌కులు. అదే ఇప్పుడు బీజేపీనీ తీవ్ర ఇబ్బందుకు గురిచేస్తోంది.అదే జ‌రిగితే దేశంలో బీజేపీకీ మాయ‌ని మ‌చ్చేన‌ని చెప్పాలి.

సుప్రీం ఆదేశాల నేపథ్యంలో అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్న ఉమా భారతి బుధవారం మాట్లాడుతూ రామ మందిరం కోసం తన జీవితాన్ని సైతం త్యాగం చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి అయోధ్య వెళ్లేందుకు ఉమ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే బీజేపీ చీఫ్ అమిత్‌షాతో సమావేశం అనంతరం ఆమె తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకోవాలని షా కోరడంతో ఉమభార‌తి  విరమించుకున్నట్లు  సమాచారం. కాగా, అద్వానీ, జోషీ, ఉమాభారతిపై నమోదైన అభియోగాలు కనుక రుజువైతే భారత శిక్షా స్మృతి ప్రకారం రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ప్రసంగాలు ఇవ్వడం తదితర నేరాల కింద గరిష్టంగా వీరికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఈకేసును ఇక సాగ‌దీయ‌కుండా రెండు సంత్సరాలలో పూర్తి చేయాల‌ని ల‌క్నోహైకోర్టును ఆదేశించింది.  కేసు  ముగిసి పోయింద‌నుకున్న త‌రునంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ సీనియ‌ర్‌నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేసు రుజువైతే   రాజ‌కీయ చ‌ర‌మాంకంలో ఉన్న ఈ వృధ్ద‌నేత‌ల‌కు జైలు శిక్ష ప‌డిందంటే అది బీజేపీకి పెద్ద దెబ్బ‌తో పాటు మాయ‌ని మ‌చ్చ‌.  ఈకేసులో తీర్పు ఎలా ఉండ‌బోతోంద‌నేది తెలియాలంటే రెండు సంవ‌త్స‌రాలు ఆగాల్సిందే. 

Related

  1. బాబుకి దిమ్మ‌తిరిగేలా చేసిన 9 త‌ర‌గ‌తి అమ్మాయి
  2. దిన‌క‌ర‌న్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
  3. జ‌గ‌న్‌ ను టార్గెట్ చేసి మాట్లాడితే.. వాళ్లు మాత్రం మేయిన్ పేజీలో ఉంటారు
  4. దిన‌క‌ర‌న్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -