Thursday, May 30, 2024
- Advertisement -

మోదీ మైండ్‌గేమ్‌.. అద్వానీకి చెక్

- Advertisement -
narendra modi mind game

ప్ర‌స్తుతం  రాజ‌కీయాలంటే ప్ర‌ధానంగా క‌నిపించేది ఆధిప‌త్య‌పోరు.  రాజ‌కీయ‌మంటేనే మ‌ళ్ళ కంప‌ లాంటిది. ఎదైనా త‌న‌కు ప్ర‌తిప‌క్ష‌పార్టీనుంచి లేక సొంత పార్టీ నేత‌ల ల‌నుంచి ఆప‌ద ముంచు కొస్తూందంటే వారికి చెక్ పెట్టేందుకు రాజ‌కీయ ఆస్త్రాలు ప్ర‌యేగించాల్సిందే. అలాంటి ఆస్త్రాలు ప్ర‌యేగించ‌డంలో ఆరితేరిన వారు మోదీ అని చెప్పుకోవ‌చ్చు. ఎవ‌రిని ఎక్క‌డ పెట్టాలో……ఎవ‌రిని అంద‌లం ఎక్కించాలో మోదీకి వెన్నుతో పెట్టిన విద్య‌. బీజేపీ కుర‌వృద్దుడు సీనియ‌ర్ నేత ఎల్ కే అద్వానీకి చెక్ పెట్టాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.  

లేక‌పోతే అద్వానీ మోదీముందు నిస్సాయ స్తితిలో  నిల‌బ‌డాల్సి ప‌రిస్థితి అద్వానికిలేదు. శిష్యుడు అధికారంలో ఉండ‌గా గురువుకు సుప్రీంనుంచి వ్య‌తిరేక తీర్పులు వ‌స్తున్నాయంటే …దీని వెనుక ప్ర‌ధాని మోదీ హ‌స్తం ఉంద‌న్న వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.జూన్‌లో ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ముగిసిపోనున్న నేప‌థ్య‌లో కొత్త రాష్ట్ర ప‌తిరేసులో అద్వానీ ఉన్నార‌నే ప్ర‌చారం సాగింది. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని గురువుకు కానుక‌గా ఇస్తున్నార‌నీ ప్ర‌చారం బాగా సాగింది. అయితే వాస్త‌వానికి   అద్వానీని రాస్ట్ర‌ప‌తిని చేయ‌ల‌ని మోదీకి  ఇష్టంలేదు. అలాని పైకి బ‌హిర్గ‌త ప‌ర‌లేదు. కానీ లోలోప‌ల చేయాల్సింద‌ల్లా చేశాడు. సీబీఐ అనేది  కేంద్రం క‌నుస‌న్న‌ల్లో  ఉంటాద‌నేది  అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.అలాంటిది  అద్వానీకి వ్య‌తిరేకంగా వ్వ‌వ‌హ‌రించ‌డంచూస్తే ఇది మోదీ ప‌నేన‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

రాజ‌కీయాల‌నుంచి సాగ‌నంపాలంటే అంద‌రూ ప్ర‌యేగించే ఆయుధం.. పొమ్మ‌న‌లేక పొగ‌బెట్ట‌డం… మోదీ కూడా అలానే వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స‌మాచారం. ఎలాగూ బాబ్రిమ‌సీదు విధ్వంసం కేసు అద్వానీ  మెడ‌కు వేలాడుతుందీ కాబ‌ట్టి  రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో ఆయ‌న‌ను కూర్చోబెట్ట‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. త‌న వెనుకు ఏంజ‌ర‌గుతుందో ముందే గ్ర‌హించి అద్వానీ నేను రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో లేన‌ని ముందుగానే ప్ర‌క‌టించారు.ఇలా ఒక్క అద్వానీనే కాదు .. త‌న‌కు పోటీగా ఎదుగుతున్న నాయ‌కుల‌ను ఎవ‌రిని ఎక్క‌డ పెట్టాలో  తెలివిగా అక్క‌డ పెట్టేశాడు.  మ‌నోహ‌ర్ పారిక‌ర్‌లాంటి సీనియ‌ర్‌నేత‌ను గోవాకే ప‌రిమితం చేశారు…రాజ్‌నాథ్ సింగ్‌ను యూపీకే ప‌రిమితం చేయాల‌నీ చూసినా ఆర్ ఎస్ ఎస్ జోక్యంతో అదికుద‌ర‌లేదు. బాబ్రీ కేసులో ఉన్న ఉమాభార‌తి,ముర‌ళీ మ‌నోహ‌ర్‌లాంటి నేత‌ల‌వ‌ల్ల ప్ర‌ధాని మోదీకీ ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదురుకావు.యూపీ సీఎం యేగి ఆథిత్యానాథ్ పేరు వినిపిస్తున్నా ప్ర‌స్తుతానికి అయ‌న నుంచి  మోదీకీ వ‌చ్చేన‌ష్టంలేదు. త‌న‌కు పార్టీలో గ‌ట్టిపోటీ ఇచ్చే నాయ‌కుల‌ను  రాజ‌కీయంతో ప‌క్కు కు పెట్టాడ‌నంలో సందేహంలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

Related

  1. త్వ‌ర‌లోజ‌గ‌న్‌తో శిల్పామోహ‌న్‌రెడ్డి భేటీ
  2. ట్రిపుల్ త‌లాక్‌పై యోగి సంచ‌ల‌న కామెంట్స్‌
  3. చంపేస్తామంటు కిష‌న్‌రెడ్డికి పోన్ కాల్స్
  4. ఫేస్‌బుక్ మాయ‌లేడీ..యువ సాప్ట్ వేర్ ఇంజినీర్‌కు చుక్క‌లు చూపించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -