Friday, March 29, 2024
- Advertisement -

తైవాన్ చిచ్చు.. అమెరికా-చైనా వార్ ?

- Advertisement -

ప్రపంచ దేశాలన్నిటిపై అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైజ్ఞానికంగా.. సాంకేతిక పరంగా అమెరికా ప్రపంచ దేశాలన్నిటిపై కూడా ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే అమెరికా ను పెద్దన్న స్థానం నుంచి గద్దె దించేందుకు రష్యా, చైనా వంటి దేశాలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా దేశం అమెరికాకు ఎప్పటినుంచో విరుద్దంగా ఉంటూ వస్తోంది. అమెరికా అండగా నిలిచే దేశాలపై చైనా వ్యతిరేకత చూపుతూనే వస్తోంది అలాగే చైనా వ్యతిరేక దేశాలకు అమెరికా అండగా నిలుస్తువస్తోంది. ఈ విధంగా ఇరు దేశాలు కూడా ఉప్పు నిప్పు లాగా ప్రవర్తిస్తున్నాయి.

తాజాగా ఈ ఇరు దేశాల మద్య తైవాన్ విషయంలో మరోసారి అగ్గి రాజుకుంది. ఎప్పటినుంచో తైవాన్ పై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తూనే ఉంది. తైవాన్ పై పట్టు సాధించి దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చెలాయించాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్ కు అండగా అమెరికా నిలుస్తోంది. ఇటీవల తైవాన్ కు అండగా 862 కోట్ల రూపాయల విలువైన మిలిటరీ ఆయుధాలను కూడా సరఫరా చేసేందుకు కూడా ఆమోద ముద్రా వేసింది అమెరికా. దాంతో చైనా.. అమెరికా విధానంపై మరింత ఆగ్రహంగా ఉంది.

ఈ ఏడాదిలో ఏకంగా నాలుగు సార్లు తైవాన్ కు అమెరికా ఆయుధాలను సరఫరా చేసింది. అంతే కాకుండా జూలై 9 న అమెరికా- తైవాన్ మద్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరిగాయి.. దాంతో అమెరికా, తైవాన్ మద్య ఉన్న సంబంధం చైనాకు అసలు మింగుడు పడడం లేదు. దాంతో యుద్దానికి రెడీ అన్నట్లుగా పెద్ద ఎత్తున యుద్ద విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపుతోంది చైనా. ఈ నేపథ్యంలో తైవాన్ కు అండగా అమెరికా భారీగా ఆయుధాలను సరఫరా చేయడంతో తైవాన్ విషయంలో చైనా, అమెరికా మద్య యుద్ద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

సరిహద్దు రచ్చ.. సద్దుమనిగేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -