- Advertisement -

2019 ఎన్నిక‌ల టార్గెట్ రెండు రాస్ట్రాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కోసం వేట సురూ..

- Advertisement -
2019 Elections

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నిక‌లే టార్గెట్‌గా పార్టీల‌న్నీ పావులు క‌దుపుతున్నాయి. ఇంకా రెండు సంవ‌త్స‌రాలు ఉన్నా ఇప్ప‌టినుంచే వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ప్ర‌జాభిమానం ఉన్న నాయ‌కుల‌కు గాలం వేసేందుకు సిద్ద‌మ‌య్యాయి.ఏనియేజ‌క వ‌ర్గంలో ప్ర‌జాభిమానం ఉన్న నేత‌ల‌కోసం అన్వేష‌న ప్రారంభించాయి పార్టీలు. దీంతో రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు జోరుగా మారుతున్నాయి. ఇత‌ర పార్టీల‌ల్లో ఉన్న బ‌ల‌మైన నేత‌ల‌కోసం ఇప్ప‌టినుంచే  ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఏపీ విష‌యానికి వ‌స్తే   అన్ని పార్టీలు ఎన్నిక‌లే టార్గెట్‌గా ముందుకెల్తున్నాయి.

ఇక ప్ర‌ధానంగా  వైకాపా, టీడీపీ, బీజేపీ, పవన్ జనసేన పార్టీలు  పనిచేస్తున్నాయి. వైకాపా , జ‌న‌సేన పార్టీలు  ఏపీకీ ప్ర‌త్యేక హోదాపై ముందుకెల్తుంటే …బీజేపీ మాత్రం సొంతంగా పోటీచేసేందుకు  అన్ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే ఆపార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆపార్టీకీ బ‌ల‌మైనా సామాజిక నాయ‌కులు ఎవ‌రూలేరు.  ఒంట‌రిగా పోటీచేయాలంటే  ప్ర‌జాభిమానం ఉన్న నాయ‌కులు అవ‌స‌రం ఆలాంటి  నాయ‌కుల‌కోసం వేట ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. ఇక అన్నీ చూసుకుంటే ఏపీలో  మూడు ముక్కలాట వుంటుందని.. టీడీపీ, వైకాపా, జనసేనల మధ్య తీవ్రంగా పోటీ ఉంటుందనేది విశ్లేష‌కుల అంచ‌నా. ఇక తెలంగాణాలోకూడా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు జోరుగా ఊపందుకున్నాయి. ఏపీలో వైకాపా, టీడీపీ, బీజేపీ, పవన్ జనసేన పార్టీలు ఎలా ప‌ని చేస్తున్నాయో … ఇదే త‌ర‌హాలో తెలంగాణాలోనూ 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ….. కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని దెబ్బ‌తీసే విధంగా పార్టీలు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి.

ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్సరాలు గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టినుంచే గెలుపు గుర్రాల‌కోసం  బీజేపీ గాలం వేస్తోంద‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఇందుకోసం టీడీపీ,కాంగ్రెస్‌లో పార్టీల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కోసం గాలం వేస్తున్న‌ట్లు స‌మాచారం. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలమైన నాయకుల కోసం బీజేపీ అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వ సమీకరణాలతో కేసీఆర్ పార్టీకి గట్టిదెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇక జ‌న‌సేన పార్టీకూడా తెలంగాణాలో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప‌వ‌ణ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. విప్ల‌వ గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌తో క‌ల‌సి పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. దీనికోసం గ‌ద్ద‌ర్  వామ‌ప‌క్ష‌పార్టీల‌ను ఏక‌తాటిమీద‌ర‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేసిన కాంగ్రెస్ నేత సురేష్ రెడ్డికి కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు సమాచారం. మరి  రెండు రాష్ట్రాల్లో ఏపార్టీకీ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారో తెలియాలంటే వేచి చూడాలి.

Related

  1. పార్టీలో టికెట్ల  బేర‌సార‌ల లొల్లి ఏంది ప‌వ‌ణ్‌
  2. నైట్‌పార్టీలు-రేవ్ పార్టీల‌ను నిషేదించే దిశ‌గా గోవా స‌ర్కార్‌
  3. తెలంగాణ నాయకులకు ఉన్న ప్రేమ.. మీకు లేదా బాబు
  4. ఇది చదివితే.. జగన్‌కు చేతులెత్తి మొక్కడం ఖాయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -