Tuesday, May 14, 2024
- Advertisement -

ప్ర‌శ్నించిన వారంతా అవినీతి ప‌రులేనా

- Advertisement -
MP Siva Prasad comments on Chandrababu Naidu

ఒక్క‌ప్ప‌టి రాకీయాలు వేరు..ఇప్ప‌టి రాజ‌కీయాలు వేరు. ఒకప్పుడు నీతి,నియ‌మాలు,ధ‌ర్మం, ప్ర‌జాసేవ‌కోసం రాజకీయాల్లో వ‌చ్చేవారు.కానీ  రానురాను రాజ‌కీయాలు వ్యాపారాలుగా మారిపోయాయి . మారిపోయిని కాల‌మాన ప్ర‌కారం రాజ‌కీయాల్లో  ఎవ‌రూ ప‌రిశుద్దులు లేరు.

అసెంబ్లీలోకి ప్ర‌వేశించే ప్ర‌తీ ఒక్క‌రికీ  క్రిమిన‌ల్ చ‌రిత్త ఉన్నవారు. అందరూ ఇసుక దందాలు, భూముల కబ్జాలు, కాంట్రాక్టుల్లో కమిషన్లు, ఇంకా అనేకానేక ఆదాయ మార్గాలు. అయితే  అధ్య క్షుడికి  ఏవ‌రు ఏంచేస్తున్నారో  వారికి సంబందంచిన చ‌రిత్ర  ఉంటుంది.   ఏదైనా పార్టీలో అసంతృప్తి క‌లిగి పార్టీనీ దిక్క‌రిస్తే చాలు అనాయ‌కుడి బండారం అంతా బ‌య‌ట‌కు వ‌స్తాయి.

ఇక  ఇలాంటి వ్య‌వ‌హారాలు   తెలుగుదేశం పార్టీ వ్యవహారం కూడా ఇందుకు అతీతం కాదు. ఎవరయితే మంత్రిపదవులు రాకనో, ఆశించినది అందకనో, అలిగినా, ఆగ్రహించినా, మొత్తం వారి చ‌రిత్ర తవ్వి బయటకు తీస్తారు. మీడియాలో కక్కేస్తారు. దాంతో అలిగిన నేత, ఆగ్రహించిన నేత ,ధిక్కారం వినిపించిన నేతల ప‌ని అంతే.  

ఇప్పుడు  చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వంతు వచ్చింది.  ఎప్పుడైతే  ఎస్సీలకు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదంటూ ఆయన నిన్నటికి నిన్న నిప్పులు కక్కారు. అంతే ఇప్పుడు ఆయన లొసుగులు బయటకు తీసే పనిని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్టార్ట్ చేశారు.  హాథీరామ్ బాబా భూములు కావాలని కోరారని…. ఇవ్వలేదనే శివప్రసాద్ ఇలా విమర్శలు చేస్తున్నారని ఆయన సింపుల్ గా తేల్చేసారు. ఇలాంటి బెదిరింపులకు తాను లొంగనన్నారు. అవ‌స‌రం అయితే పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు.పూర్తిగా బ‌య‌ట‌కు పంపించే దానికి డిసైడ్ అయ్యారంట‌.  పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించాలంటే ఏదోఒక కార‌నంలేనిదే పంపించ‌లేరు. అందుకే బాబు  హాథీరామ్ బాబా భూములు వ్య‌వ‌హారాన్ని సాకుగా చూపిస్తున్నారు.

ఇప్పుడు ఇస్యూ మొత్తం హాథీరామ్ బాబా భూములు ఏమిటి? శివప్రసాద్ వాటిని ఏ విధంగా కావాలనుకున్నారు? ఇలాంటి వాటి వైపు వెళ్లిపోతుంది. ఇంకేముంది, శివప్రసాద్ ఢిఫెన్స్ లో పడతారు. శివప్రసాద్ వైనం చూసాక మరే నేత నోరు మెదపరు. ఎందుకంటే అవినీతి చ‌రిత్ర‌లేని నాయ‌కులు ఉండ‌రుక‌దా….. పైగా ప్రతి నేత ఫైలు చినబాబు, పెదబాబుల దగ్గర  ఉంటుంది.ఇలా అయితేనే ఇంకెవ‌రూ పార్టీనీ ధిక్క‌రించ‌కుండ ఉంటార‌నేది బాబు వ్యూహం.

Also Read

  1. పార్టీ పై  చంద్ర‌బాబుకు పట్టు తప్పుతోందా…?
  2. లోకేష్ మంత్రి స్థానంలో ఉండి.. ‘వర్థంతి శుభాకాంక్షలు’ అని ఎవరైనా చెబుతారా?
  3. చిత్తూరు జిల్లాలో టీడీపీకీ మ‌రోషాక్‌… వైసీపీ వైపు ఎంపీ శివ‌ప్ర‌సాద్ చూపు
  4. కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -