Thursday, May 2, 2024
- Advertisement -

కేంద్రంతో కయ్యానికి కేసీ ఆర్ సై

- Advertisement -
Muslim reservation Bill Passed in KCR Style

తెలంగాణా సీఎం  కేసీఆర్  కేంద్రంతో తేల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి అమోదింప‌జేశారు.  ఈరిజ‌ర్వేష‌న్ల‌కోసం తాము కేంద్రాన్ని  బ్ర‌తిమ‌లాడబోమ‌ని డిమాండ్ చేస్తామ‌ని అవ‌స‌రం అయితే పైట్ చేస్తామ‌నీ కేసీఆర్  అసెంబ్లీలో ప్ర‌క‌టించారు.

రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని అనేక స‌భ‌ల‌లో ప్ర‌క‌టించ‌డంతోపాటు మేనిపెస్టోలోకూడా పెట్టామ‌ని తెలిపారు. ముస్లింలు వెనుక‌బ‌డి లేరా ?   వారు ప‌న్నులు క‌ట్ట‌డంలేదా…. ఈదేశ పౌరులుకాదానీ  అసెంబ్లీలో  బీజేపీపై ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించారు.దీన్ని బ‌ట్టిచూస్తే కేసీఆర్ బీజేపీతో క‌య్యానికి సిద్ధ‌మ‌య్యార‌న అర్థ‌మ‌వుతోంది.

తెలంగాణాలో బీజేపీనీ బ‌లోపేతం చేసేందుకు అదిష్ఠానం    ప్ర‌ణాలిక‌లు రూపొందింస్తుండ‌టంతో కీసీఆర్ అమీతుమీకే సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. 2019 సాధార‌న ఎన్నిక‌ల్లో  కనీసం 30 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలు గెలవాలని అమిత్ ప్లాన్ చేస్తుండటం తో, ఇక బిజెపి తో తాడోపేడో తేల్చుకోవాలని కెసిఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  ముస్లిం రిజర్వేషన్ల రూపంలో తొలిసారి కెసిఆర్ మోది కి సవాల్ విసిరార‌నీ రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.ఇది కీసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డేన‌ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ వ్య‌తిరేకం కాబ‌ట్టి 2019 లో ఎన్నిక ల్లో కేసీఆర్ 12 శాతం రిజ‌ర్వేష‌న్ల ప్లాన్‌తో కొట్టాల‌ని కీసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

గ‌తంలో కేంద్ర‌లో టీఆర్ఎస్ చేర‌డం ఖాయ‌మ‌నే  ఊహాగానాలు వినిపించాయి. కవిత, జితేందర్ రెడ్డిలు కేంద్ర మంత్రివర్గంలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. కెసిఆర్ కూడా మోది కి దగ్గరయే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనబడ్డాయి. నోట్ల రద్దు విషయంలో ఎన్డీయే ముఖ్యమంత్రులకన్నా కెసిఆర్ మోదికి ఎక్కువ సపోర్ట్ గా నిలబడ్డారు. జి.ఎస్.టీ.బిల్లుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్ళు కావస్తుండగా, ఇప్పటిదాకా ముస్లిం రిజర్వేషన్ల ప్రతిపాదనని కెసిఆర్ పక్కనబెట్టడానికి బిజెపి తో దోస్తీ ఆలోచనే కారణం అని కూడా అనుకున్నారు.సడెన్ గా ఇప్పుడు కెసిఆర్ స్వరం మారింది. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీకీ చెక్ పెట్టేదానికే కేసీఆర్ ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను పైకితీసుకొచ్చార‌ని అంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు.

రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచుతూ ఇవాళో రేపో ఆర్డినెన్స్ వస్తుందని, ఆశపడుతున్న తెలుగుదేశం పార్టీ కి ఇది మింగుడుపడని పరిణామమే. ఇద్దరు చంద్రులు మోది తో సఖ్యతగా ఉంటేనే కేంద్రం, అసెంబ్లీ సీట్లు  పెంచే ప్రయత్నం చేస్తుంది.  ఇప్పుడు కెసిఆర్ మోది ని ఎదిరిస్తుండటంతో అసెంబ్లీ సీట్ల పెంపు అయోమయంలో పడింది.ఏదైనా రాష్ట్ర అభివృద్దికి కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉంటేనే ఏవైనా ప‌నులు జ‌రుగుతాయి. మ‌రి కేంద్రాన్ని ఎదిరిస్తే ఏంజ‌రుగుతాదనేది ఇద్ద‌రికి తెలుసు. ఇక సీఎం కేసీఆర్‌లాగా ….చంద్రబాబు ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో అమీతుమీకి తేల్చుకోవ‌డానికి ధైర్యం చేస్తారాలేదానేది ఇప్పుడు అంద‌ర్నీ  అలోచింప‌జేస్తోంది.

Also Read

  1. ఖ‌రీదైన కూలీ కేటీఆర్
  2. అసెంబ్లీ నియేజ‌క‌వ‌ర్గాల‌పెంపుపై తెలుగు రాష్ట్రాల‌కు షాక్‌ పెంపుయేచన లేద‌న్న కేంద్రం
  3. సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన.. ఒక్కొకరి అకౌంట్ కి 4 వేలు..
  4. రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ-టీఆర్ ఎస్ మాట‌ల యుధ్దం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -