Monday, May 20, 2024
- Advertisement -

అతి పిన్న వ‌య‌సులోనే ఫ్రాన్స్ అధ్య‌క్షుడిగా చ‌రిత్ర‌ సృష్టించ‌న మాక్రాన్‌

- Advertisement -

 

Macron wins French presidency, to sighs of relief in Europe

ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి ఆదివారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎన్ మార్చె మూవ్ మెంట్ కు చెందిన ఎమ్మాన్యుయెల్ మాక్రాన్(39) ఘ‌న‌విజ‌యం సాధించారు.ఇది ఫ్రాన్స్ చ‌రిత్ర‌లోనే ఓ రికార్డు. అతను స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలిచి… చరిత్ర సృష్టించారు.

దేశంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఓ స్వతంత్ర అభ్యర్థి అధ్యక్షుడిగా గెలవడం ఫ్రాన్స్ లో సంచలనమే. మేక్రాన్ కు 66.06 శాతం ఓట్లను సాధించారు. ఫ్రాన్స్ కు అతి చిన్న వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి కూడా మేక్రానే. ఇప్పుడు ఇతని వయసు 39 ఏళ్లు. ఆది నుంచి ప్రత్యర్థులపై మేక్రాన్ ఆధిక్యత చూపిస్తూ వస్తున్నారు.
ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుల ఉంటె ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఎన్నికుట్ర ర‌లు ప‌న్నినా ప్ర‌జ‌లు ఆద‌రించిన వ్య‌క్తే అధ్య‌క్షుల‌వుతార‌ని ఫ్త ఫ్రాన్స్ నూత‌న అధ్య‌క్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ నిరూపించారు. మొద‌టి నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ గెల‌పు సాధ్య‌మేన‌ని చెప్పాయి. ప్రజలు అతని పక్షానే ఉన్నట్టు చెప్పాయి. మేక్రాన్ అభిమానులు గెలుపు సంబరాలను పారిస్ లో చాలా ఆనందంగా చేసుకున్నారు.
నిజానికి మాక్రాన్ నాలుగేళ్ల కిందట ఫ్రాన్స్ రాజకీయాల్లో ఒక అనామకుడనే చెప్పాలి. ఆయన ఒక ఉద్యోగి… ఆ తరువాత ఇన్వెస్టమెంటు బ్యాంకర్ గా మారి మిలియనీర్ గా పేరు తెచ్చుకున్నారు.. అనంతరం ఫ్రాన్స్ కు ఆర్థిక మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడయ్యారు. ఆయనకు గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర కానీ… దేశవ్యాప్తంగా నెట్ వర్కు – ఓటు బ్యాంకు కానీ ఏమీ లేవు. కానీ.. ప్రజాదరణ మాత్రం భారీగా ఉండడంతో గెలుపు సులభమైంది. గత ప్రభుత్వాలు విఫలమైన అంశాల్లో స్పష్టమైన హామీలిచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. నిరుద్యోగం ఉపాధ్యయులు వంటివారికి జీతాల పెంపు తదితర హామీలు బాగా కలిసొచ్చాయి.
ఫ్రాన్స్ విజయం సాధించింది. నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తీరుస్తాను. మనకి శక్తి ఉంది… కావాల్సినంత సామర్థ్యం ఉంది… ధైర్యం ఉంది…’ అని అన్నారు. దేశాన్ని సమైక్యంగా ఉంచుతానని, వేర్పాటు వాదాన్ని దూరం పెడతానని, యూరోప్ ను రక్షిస్తానని ఆయన చెప్పారు. మేక్రాన్ విజయం నిజంగా ఫ్రాన్స్ చరిత్రలో ఓ సంచలనమే.

Related

  1. ప‌శువుల దాణా కుంభ‌కోనం కేసులో లాలూకు ఎదురుదెబ్బ
  2. ప్రధాని నరేంద్రమోదీ అంతరిక్ష దౌత్య చాకచక్యానికి నిదర్శనమే జీశాట్ -9 ఉప‌గ్ర‌హం
  3. అవినీతి ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న కేజ్రీ వెంట‌నే రాజీనామ చేయాలి కాంగ్రెస్ పార్టీ నేత అజ‌య్ మాకెన్‌
  4. యుద్ధ‌రంగంలోకి ఉత్త‌ర‌కొరియా దిగుతోందా……?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -