Wednesday, May 8, 2024
- Advertisement -

ఇక మార‌వ లోకేష్‌ నీకు దండంపెడ‌తర‌ కొడుకో

- Advertisement -
Nara Lokesh tongue slip blender mistake again and again

ఏపీ కాబోయే సీఎం లోకేష్‌కు తండ్రి ద్వారా వ‌చ్చిన పాపులారిటిక‌న్నా త‌ను సొంతంగా పాపులారిటీ సంపాదించి తండ్రిని మించిపోయాడు. ఇదేదో ప్ర‌జాప‌రిపాల‌న‌లో అనుంకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే. త‌ను మాట్లాడే భాష ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఏముహూర్తంలో టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి – ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టినారో అప్ప‌టినుంచి  నారా లోకేశ్ ను వివాదాలు వ‌ద‌డంలేదు.

మొన్నటికి మొన్న ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా నాలిక మడతతో విపక్షాలకు అడ్డంగా బుక్కైన లోకేశ్… ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జయంతిని వర్ధంతిగా మార్చేసి… ఆ వర్ధంతికి కూడా శుభాకాంక్షలు చెప్పినవ్వులపాలైన లోకేశ్, తాజాగా మరోసారి ప్రజలు అవాక్కయ్యేలా మాట్లాడి…  అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన లోకేశ్‌.. పెద్దాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా కరపలో ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెటూరుకు తాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమనడంతో సభలో జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. లోకేశ్‌ ఈ సమ యంలో ‘ఇబ్బంది.. కాదు.. కాదు’ అంటూ తడబడుతూ చివరివరకు ఒక్కో మాట వత్తి పల కడంతో సభకు హాజరైనవారు ఘొల్లున నవ్వారు. సహజంగా ఏ మంత్రయినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెబుతుంటారు.కానీ మ‌న చిన‌బాబు రూటే వేరు క‌దా.

చినబాబు ప్రసంగానికి ముందు మాట్లాడిన చినరాజప్ప… నారా లోకేశే మన భావి సీఎం అంటూ ప్రకటించిన మరుక్షణమే లోకేశ్ నోట ఈ సమస్యల సృష్టి మాట వినపడంచూస్తే  మ‌రోసారి చిన‌బాబుకు ఎంత‌ప‌రిజ్ణానం ఉందో అక్క‌డి ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు. కాబోయే సీఎం హోదాలో వచ్చేసిన చినబాబు… సమస్యల సృష్టే తన లక్ష్యమంటూ చేసిన ప్రకటన విన్న కరప వాసులు.. ఇక తమ సమస్యలను పరిష్కరించాలని ఎవరిని అడగాలో అంటూ గుసగుసలాడుకున్న వైనం కూడా కనిపించింది.తండ్రి ప‌రువు తీయ‌డంతోపాటు ….. ఈయ‌నా తెలుగు ప్ర‌జ‌ల‌ను ప‌రిపాలించేద‌ని అక్క‌డున్న జ‌నం న‌వ్వుకుంటున్నారు. చిన‌బాబు మారాలంటే మండ‌లి బుద్ద‌ప్ర‌సాద్‌,ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ద‌గ్గ‌ర తెలుగు నేర్చుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌డంలేదు. 

{youtube}y7gyapKTAFk{/youtube}

Related

  1. లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..
  2. లోకేష్ మంత్రి స్థానంలో ఉండి.. ‘వర్థంతి శుభాకాంక్షలు’ అని ఎవరైనా చెబుతారా?
  3. చంద్ర‌బాబు,లోకేష్ ఒక్క‌రోజు తాగే నీరు ఎంత ఖర్చు ఎంతో తెలుసా..?
  4. నారా లోకేష్ ఆస్తులు పెరగడానికి కారణం ఏంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -