Wednesday, May 15, 2024
- Advertisement -

బెంగులూరులో క‌ల‌క‌లం రేపుతున్న ప్లాస్టిక్ చెక్కెర‌

- Advertisement -
Plastic sugar enters markets in Karnataka

క‌ల్తీ వ్యాపారం అక్ర‌మార్కుల‌కు వ‌రంగా మారింది.స‌రైన త‌నిఖీలు లేక‌పోవ‌డంతో క‌ల్తీ వ్యాపారాలు తెగించేస్తున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు ప్లాస్టిక్ బియ్యం, కోడి గుడ్లు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నవిష‌యం తెలిసిందే.

ఇప్పుడ మ‌రో తాజా క‌ల్తీ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రావ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.ఈసారి కల్తీ అయ్యింది వింటె మీరు షాక్ అవుతారు.ఈ సారి అక్ర‌మార్కులు పంచ‌దార‌ను కల్తీచేసి అమ్ముతున్నారు.ఇది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
కర్ణాటకలో ప్లాస్టిక్ పంచదార(చక్కెర ) సంచలనంగా మారింది. పలు దుకాణాల్లో ఈ ప్లాస్టిక్ చక్కెర అమ్ముతున్నట్లు తెలుస్తోంది.బెంగళూరులోని హస్సన్ ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే రైల్వే పోలీసు వారం రోజుల క్రితం ఓ దుకాణం నుంచి మూడు కిలోల చక్కెర కొనుగోలు చేశాడు. ఇంట్లో టీ పెడుతుండగా అందులో వేసిన చక్కెర కరిగిపోయి గిన్నెకి ప్లాస్టిక్ అంటుకోవడంతో వెంటనే మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.

{loadmodule mod_custom,GA1}

గడగ్ ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ చక్కెర కలకలం రేపింది. ఇలా ప్లాస్టిక్ చక్కెరను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. కాగా, సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ప్లాస్టిక్ చక్కెరపై విచారణకు ఆదేశించారు.క‌ల్తీ అన్న‌తి స‌ర్వసాధార‌నం అయ్యింది.ప్ర‌జ‌లు ఆహార వ‌స్తువులు ఏవి కొనాల‌న్న బెంబెలెత్తుతున్నారు.ఇక నైనా ఇంట్లోకి నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనేట‌ప్పుడు జాగ్ర‌త్త‌.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -