Saturday, May 18, 2024
- Advertisement -

వీళ్ళకు బాహుబలిని బీట్ చేయాలనే కలలు కూడా లేవు!

- Advertisement -

ఆ హీరోలందరూ మొన్నటి వరకూ బాహుబలిని అది చేసేస్తాం,ఇది చేసేస్తామని విర్రవీగారు.ఫస్ట్ డే రికార్డులను క్లీన్ స్వీప్ చేసేది  మేమంటే మేమంటూ… నానా హంగామా చేశారు.

కాని ఇపుడు రోజు రోజుకు బాహుబలి మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తూ ఉండడంతో… ముందు పాడిన పాటను వారిపుడు పాడటం మానేశారు.టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మార్కెట్ లో ఉన్న టాప్ హీరోలందరి టార్గెట్ ఒక్కటే.అదే బాహుబలి రికార్డులను కొట్టడం. దానికోసమే అన్నట్లుగా ముందుగా అనుకోని ప్లాన్ లను సైతం…. లాస్ట్ మినిట్లో షురూ చేయడం మొదలు పెట్టారు.కోలీవుడ్ నుంచి విజయ్ ,డైరెక్టర్ శంకర్లు ఒక వైపు….. టాలీవుడ్ నుంచి మెగా కాంపౌండ్ ,మహేష్ బాబులు మరో వైపు ..బాహుబలిని బీట్ చేసేది మేమే అన్నట్లుగా గత కొన్ని రోజులనుంచి ఎక్కడలేని కలరింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. కాని తాజాగా వచ్చిన రిపోర్ట్ లు బాహుబలికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు చూసాక…. ఎక్స్ ట్రా పాలిటిక్స్ కు చెక్ పెట్టేశారు.

తాజాగా బాక్సాపీస్ ట్రేడ్స్ అందించిన లెక్కల ప్రకారం.. బాహుబలి మూవీ 400 కోట్ల మార్క్ ని టచ్ చేసింది.ఐతే ఈ రికార్డ్ ని పక్కన పెడితే ఒక తెలుగు మూవీకి హిందీలో ఎన్నడూ రానంతగా, అలాగే ఎనాడూ ఊహించనంతగా కలెక్షన్స్ వస్తున్నాయి.దానికి సంబంధించిన మ్యాటర్లోకి  వెళితే, తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మూడో వారం, బాక్సాపీస్ వద్ద ప్రభంజనాన్ని చాటుతుంది.  తమిళం, హిందీల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, బాహుబలి ఊపు ఏ మాత్రం తగ్గలేదు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఇప్పటి వరకూ బాహుబలి మూవీ 85 కోట్ల రూపాయల కలెక్షన్స్  కొల్లగొట్టింది. లాంగ్ రన్ ఈ మూవీ సైతం 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టటం ఖాయం అని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.ఒక తెలుగు డబ్బింగ్ మూవీకి బిటౌన్ వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ అనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగా ఈ ఫీట్ ని సాధిస్తున్న బాహుబలి మూవీ, ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇండియాలో అగ్రస్థానాన నిలబెట్టుతుందని అంటున్నారు.

బాహుబలి సాధిస్తోన్న ఈ రికార్డులు చూసే కాబోలు పులి,శ్రీమంతుడు చిత్రాలు రెండు రోజులనుంచి తమ ప్రమోషన్ స్ట్రాటజీని మార్చుకున్నాయి.బాహుబలి కలెక్షన్లతో కంపేర్ చేయడం మానేసి తమ పాత చిత్రాల రికార్డులను ఎలా బ్రేక్ చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి.అనవసర గొప్పలకు పోయి బ్యాడ్ అవ్వడం కంటే…. ఎంత తగ్గితే అంత మంచిదంటోన్న క్రిటిక్స్ మాటలను చెవిని వేసుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -