Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ ఇద్దరి ప్రమాణస్వీకారం అత్యంత నిరబడారంగా..!

- Advertisement -

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ ప్రమాణస్వీకార కార్యక్రమం సాదాసీదాగా జరగనుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో.. వాషింగ్టన్​లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం వద్ద 2021 జనవరి 20న కార్యక్రమం నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలోనే అతిథులకు అనుమతి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత వివరాలను కమిటీ వెల్లడించింది.

ప్రమాణం చేసిన అనంతరం.. బైడెన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. కరోనాపై పోరు సహా దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు, లక్ష్యాలు, ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తన విధానాలను వివరిస్తారు.

అగ్రరాజ్యంలో ఇప్పుడే వ్యాక్సిన్​ పంపిణీ జరుగుతోంది. సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా సమయమే పట్టొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని.. ప్రజలను ఇళ్ల వద్ద నుంచే కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు. వాషింగ్టన్​లో జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి రావొద్దని సూచించారు బైడెన్​.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -