- Advertisement -

ఆ సీనియర్ నాయకురాలికి హ్యాండిచ్చిన బాబు!

- Advertisement -

ఏపీలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక టీడీపీకి ముఖ్యంగా చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యంగా టికెట్ ఆశీస్తున్న సీనియర్ నేతల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే పలు స్థానాలు జనసేనకు, మరికొన్ని చోట్ల అభ్యర్థుల మార్పుతో ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం అసెంబ్లీ టికెట్‌ విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిభా భారతి వర్గంలో ఆగ్రహం తెప్పిస్తోంది.

ఈ సీటును కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొండ్రు మురళీకే ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిని ఎక్కడా టీడీపీ అధినేత కానీ సీనియర్లు కానీ ఖండించడం లేదు. దీంతో ఇదే స్థానాన్ని ఆశీస్తున్న ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ నిరాశలో మునిగిపోయారు. కొంతకాలంగా తన కుమార్తెకు సీటు ఇవ్వాలని ప్రతిభా భారతి ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని వెల్లడించారు కూడా.

అయితే ఇవేమీ పట్టించుకోని చంద్రబాబుకు కొండ్రు మురళి వైపే మొగ్గు చూపుతున్నారట. దీనికి కారణం ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్‌గా ఉండటం.2014,2019 ఎన్నికల్లో వైసీపీ గెలవగా ఈ సారి సిట్టింగ్ అభ్యర్థిని మార్చి లోకల్ క్యాండిడేట్‌కు టికెట్ ఇస్తున్నారు జగన్‌. అందుకే వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే మురళితోనే అవుతుందని భావించిన చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వానికే మొగ్గుచూపుతున్నారట. ఇదే జరిగితే ప్రతిభా భారతి వర్గం మురళికి ఏ మేరకు సహకరిస్తుంది అన్నది వేచిచూడాలి. మొత్తంగా టికెట్ అనౌన్స్‌కాక ముందే తెలుగు దేశం నేతల్లో కోల్డ్ వార్ ముదిరి పాకాన పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -