టీడీపీ అధినేత చంద్రబాబు గురించి పచ్చి నిజాలను బయటపెట్టారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు పేదప్రజల ను దోపిడీ చేస్తాడని… వారి ఎదుగుదలని ఆపేశాడని తెలిపారు. టీడీపీ ఖచ్చితంగా పెత్తందారుల పార్టీ అని తేల్చి చెప్పేశారు.
చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు 1998లో తాను విద్యార్థులతో కలిసి బాబును కలిశానని తెలిపిన కంచె ఐలయ్య..స్కూళ్లలో కనీసం ఒక మూడు సబ్జెక్ట్‌లు ఇంగ్లీష్‌లో ఇప్పించాలని కోరానని తెలిపారు. అయితే చంద్రబాబు ఒప్పుకోలేదన్నారు. తమ పార్టీ పేరే తెలుగుదేశం అని..మేమేలా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెడతామని చెప్పాని గుర్తు చేశారు. అప్పుడు బాబును కలిసిన విద్యార్థుల బృందం మీ కొడుకు లోకేష్‌ని ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివస్తున్నారని అడిగారని దానికి చంద్రబాబు వద్ద సమాధానం లేదన్నారు. అప్పుడే చంద్రబాబుకు పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ తమకు అర్థం అయిందని తెలిపారు.
ఇక రీసెంట్గా వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై కంచె ఐలయ్య ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి జగన్ సర్కార్ పేద విద్యార్థులకు మంచి చేసిందని అభినందించారు.
