మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు నందీపుర పీఠాధిపులు. ఏపీలోని తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపురలో శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహా భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని జగన్‌కు ఆహ్వానం అందించారు పీఠాధిపతులు డా.మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), ష.బ్ర. పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), శ్రీ జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఆహ్వానపత్రిక అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంఎల్‌సీ డాక్టర్ ఎ.మధుసూదన్, రామచైతన్య (ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్), వీరేష్ ఆచార్య (కో-ఫౌండర్, అర్ధనారీశ్వర ఫౌండేషన్) పాల్గొన్నారు.
