పార్లమెంట్ వేదికగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాక్రోచ్ పార్టీ మూడు రోజులుగా ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తోంది. వారికి మద్దతుగా రాహుల్, ప్రియాంక ప్రధాని ఇంటి వద్ద ధర్నా చేసారు. ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి తరువాత వదిలేసారు. ఈ రోజు పార్లమెంట్ లోనూ కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇండీ కూటమి నేతలు రాహుల్ అరెస్ట్ కు నిరసనగా ప్రొటెస్ట్ పై చర్చిస్తున్న వేళ ప్రధాని మోదీ కొత్త ఎత్తుగడ అమలు చేసారు. జాతీయ స్థాయిలో ఈ పరిణామం చర్చగా మారింది.
పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీలో నిరసనలు .. ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ ఆందోళన చేస్తోంది. పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన వేళ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల లాఠీ ఛార్జ్ గా కొందరు విద్యార్ధులు గాయాల బారిన పడ్డారు. వీరికి మద్దతుగా రాహుల్, ప్రియాంక రోడ్డెక్కారు. ప్రధాని ఇంటి వద్ద మెరుపు ధర్నా చేసారు. మూడున్నార గంటల నిరసన తరువాత పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలించారు. ఇక, పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీలు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ కార్యాలయంలో ఆసక్తి కర రాజకీయం జరుగుతోంది. ప్రధానితో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ అయ్యారు.
కొద్ది రోజులుగా శరద్ పవార్ ఎన్డీఏ లో చేరేందుకు సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం పవార్ కుమార్తె సుప్రియా సూలే హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. కేంద్రం ఈ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లులకు మద్దతు పై సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించుకునేందుకు అందరి సహకారం కోరుతోంది. ఇప్పటికే ఆప్, శివసేన, టీఎంసీ చీలక వర్గాల ఎంపీల మద్దతు ఎన్డీఏకు ఖాయమైంది. ఈ సమయంలో ఇండి కూటమిలో కీలకంగా ఉన్న శరద్ పవార్ ను ఎన్డీఏ వైపు తిప్పుకోవటం ద్వారా సరైన సమయంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని బీజేపీ ప్లాన్ సిద్దం చేసింది. అందులో భాగంగా ప్రధానితో పవార్ భేటీ రాజకీయంగా కీలక మలుపు గా భావిస్తున్నారు. ఇక.. ఎన్సీపీ ఎన్డీఏ లో చేరటం లాంఛనంగానే కనిపిస్తోంది
